Breaking News

కాటికి చేరిన నవ దంపతులు

Published on Mon, 03/02/2026 - 07:59

ఇంకా పెళ్లి బట్టలు కూడా మాసిపోలేదు. గోరింటాకు చెదిరిపోలేదు. పెళ్లింట బంధువుల సందడి అలాగే ఉంది. నవ     దంపతులు చిలకా గోరింకల్లా చూడ ముచ్చటగా ఉన్నారని ఊరంతా సంబరపడ్డారు. కానీ విధికి మాత్రం కన్నుకుట్టింది. పట్టుమని 15 రోజులకే కొత్త దంపతులు మరణించారు. కలిసి జీవిస్తామని బాసలు చేసినవారు కలిసే చనిపోయారని  అందరూ కన్నీరు పెట్టారు.

బెంగళూరు: నిండు నూరేళ్లు పిల్లా పాపలతో సంతోషంగా జీవించాలని బంధుమిత్రులు చేసిన దీవెనలు ఫలించలేదు. ఆదివారం తెల్లవారుజామున 5:30 సమయంలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని వేగంగా వచ్చిన కారు ఢీకొన్న ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం చెందారు. ఈ దుస్సంఘటన హావేరి జిల్లా శిగ్గావ్‌ తాలూకా కడహళ్లి గ్రామం సమీపంలోని 48వ జాతీయ రహదారిపై జరిగింది.
  
ఆలయానికి వెళ్లి వస్తుండగా..  
వివరాలు.. శిగ్గావ్‌ నివాసులు కార్తీక్‌ హుగార్‌ (34), ఐశ్వర్య (30)కు 15 రోజుల క్రితమే ఆడంబరంగా వివాహం జరిగింది. దంపతులు ఇద్దరూ బంధువులతో కలిసి గదగ్‌ జిల్లా నవలగుందలోని కామణ్ణ ఆలయ దర్శనానికి కారులో వెళ్లి తిరిగివస్తున్నారు. ఘటనాస్థలిలో రోడ్డుపక్కన నిలిపి ఉన్న లారీని ఢీకొన్నారు. దంపతులు గాయాలతో అక్కడే కన్నుమూయగా, మల్లికార్జున, వినాయక అనే ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు కలిసి నుజ్జయిన కారులో నుంచి శవాలను, క్షతగాత్రులను బయటకు తీసి శిగ్గావ్‌ ఆస్పత్రికి తరలించారు.  

శోకసంద్రం.. 
ఇంటికి వస్తున్నామని చెప్పిన నవ దంపతులు కాటికి చేరారని తెలిసి ఇరు కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఆస్పత్రి బంధువుల రోదనలతో మార్మోగింది. ఘటనాస్థలిని జిల్లా ఎస్పీ యశోద వంటగోడి పరిశీలించారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తుకు గురవడం వల్లనే ఘోరం జరిగిందని అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)