Breaking News

ఏళ్ల తరబడి నమ్మకంగా పనిచేస్తూ దోపిడీ.. 5కోట్ల సొత్తు స్వాధీనం

Published on Wed, 07/19/2023 - 10:33

సాక్షి, సికింద్రాబాద్‌: సికింద్రాబాద్‌ సింధీ కాలనీలో జరిగిన భారీ దొంగతనం కేసును తెలంగాణ పోలీసులు చేధించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వారి నుంచి సుమారు రూ.5.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల ప్రకారం.. సికింద్రాబాద్‌లో జవహర్‌నగర్‌ కాలనీలోని పీజీ టవర్స్‌ వ్యాపారవేత్త రాహుల్‌ గోయల్‌ నివాసం ఉంటున్నారు. అయితే, 9వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా గ్రీన్‌ ఫీల్డ్‌ రిసార్ట్స్‌కు వెళ్లారు. అనంతరం.. 10వ తేదీన ఇంటికి తిరిగి వచ్చారు. అయితే, ఇంటికి వచ్చే సరికి మెయిన్‌ డోర్‌ లాక్‌ పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా.. లాకర్‌ తాళాలు పగలగొట్టి ఉన్నాయి. అందులో ఉన్న నాలుగు కిలోల బంగారు ఆభరణాలు, 10 కిలోల వెండి ఆభరణాలు, వజ్రాలు, రూ. 49 లక్షల నగదు కనిపించలేదు. 

రూ.5కోట్ల విలువ..
దీంతో, రాహుల్‌ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ సందర్బంగా చోరీకి గురైన సొత్తు విలువ దాదాపు  ఐదు కోట్ల వరకు ఉంటుందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇక, రంగంలోకి దిగిన పోలీసులు.. రాహుల్‌ ఇంటికి కాపాలాగా ఉన్న కమల్‌, అతడి కుటుంబ సభ్యులపై ఫోకస్‌ పెట్టారు. దర్యాప్తు సమయానికి వారు కనిపించకపోవడంతో ఈ దొంగతనానికి పాల్పడి ఉంటారని బాధితుడు పోలీసులకు వెల్లడించాడు. 

నేపాలీ గ్యాంగ్‌..
కాగా, వారంతా నేపాల్‌కు చెందిన వారు కావడంతో పక్కా ప్లాన్‌తో దోపిడీకి పాల్పడే అవకాశం ఉన్నదని, ఆ దిశగా పోలీసలు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాలతో పాటు సెల్‌ఫోన్‌ సిగ్నల్స్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనంతరం.. ముంబైలో తొమ్మిది మంది నేపాలీ గ్యాంగ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇక, వీరిని ముంబైకి చెందిన ఒక ఏజెన్సీ వారిని పనిలో పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో నిందితుల నుంచి సుమారు రూ.5.5 కోట్ల విలువైన సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

ఇది కూడా చదవండి: ‘సీమా అట్టాంటిట్టాంటిది కాదు’.. యూపీ ఏటీఎస్‌ విచారణలో సంచలన నిజాలు!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)