Breaking News

హైదరాబాద్‌: నారాయణ స్కూల్‌ విద్యార్థి ఆత్మహత్య

Published on Tue, 12/17/2024 - 08:06

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో ఇటీవల విద్యార్థుల బలవన్మరణాల పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. పలు కారణాలతో సూసైడ్‌ చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మంగళవారం.. హయత్‌నగర్‌లో నారాయణ స్కూల్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏడో తరగతి విద్యార్థి లోహిత్‌ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. హయత్‌నగర్‌ నారాయణ స్కూల్‌లో హాస్టల్‌ ఘటన జరిగింది.

విద్యార్థి మృతిపై నారాయణ యాజమాన్యం పొంతనలేని సమాధానాలు చెబుతోంది.  ఫిజిక్స్‌ టీచర్‌ వేధింపుల వల్లే తమ కుమారుడు ఉరి వేసుకున్నాడని.. ఫిజిక్స్‌ టీచర్‌ క్లాస్‌ లీడర్‌తో మా కుమారుడిని కొట్టించాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. హాస్టల్‌ ఎదుట భారీగా పోలీసులు మోహరించారు.

కాగా, సాధారణంగా పలు కాలేజీల్లోని హాస్టల్‌లో ఉంటూ చదువుకుంటున్న పిల్లలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండటం.. ఒంటరితనంతో బాధపడుతుండటం.. వేరే వారితో వెంటనే కలవలేకపోవడం వంటి కారణాలతో ఇలాంటి సమస్యలు పెరుగుతున్నాయని పేర్కొంటున్నారు.

ఇక, హాస్టళ్లలో ఉండే వారికి ఎప్పుడూ చదువు గురించే చెబుతుండటం.. విశ్రాంతి లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు స్టడీ అవర్స్, క్లాసులు, హోంవర్కు.. రాత్రి చాలా ఆలస్యంగా పడుకొని, ఉదయమే నిద్రలేచి మళ్లీ క్లాసులు ఇలా తీవ్ర ఒత్తిడి తెస్తుంటారని, అందుకే విద్యార్థుల్లో తెలియని నైరాశ్యం ఏర్పడుతోందని అంటున్నారు.

 

 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)