Breaking News

ఎంత ఘోరం: పొగమంచు ఎఫెక్ట్‌.. రోడ్డుపై చెల్లాచెదురుగా శరీర భాగాలు

Published on Wed, 01/17/2024 - 15:46

లక్నో: దేశంలోని పలు ప్రాంతాలను పొగమంచు కమ్మేసింది. రహదారులు సరిగా కనిపించక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచుతో వాతావరణం అనుకూలించక విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడి.. పలు విమానాలు రద్దు అవుతున్నాయి.  పొగమంచుతో ముందుగా వెళ్తున్న వ్యక్తులు, వాహనాలు, దారులు కనిపించకపోవడంతో రోడ్డు ప్రమాదాలు సైతం జరుగుతున్నాయి.

తాజాగా అలాంటి ఘోర ఘటనే ఉత్తర ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో  చోటుచేసుకుంది. పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదానికి గురైన వ్యక్తిని గమనించలేని వాహనాదారులు.. వేగంగా వెళ్లడంతో అతడి శరీరం ఛిద్రమైంది. శరీర భాగాలన్నీ రహదారిపై చిందరవందరగా పడిపోయాయి. ఘజియాబాద్‌లో మంగళవారం ఉదయం జాతీయ రహదారి 9పై కార్మికులు శుభ్రం చేస్తుండగా.. చెల్లాచెదురుగా పడి ఉన్న శరీరభాగాలు కనిపించాయి. దీంతో కార్మికులు షాక్‌కు గురయ్యారు.

అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి పంపించారు. అయితే మరణించింది అబ్బాయా? అమ్మాయా అని గుర్తుపట్టలేనంతగా మృదేహాం తయారైంది. శరీర భాగాలన్నీ చెల్లచెదురుగా పడిపోయాయి. కొన్ని విడిపోయిన శరీర భాగాలు మాత్రమే పోలీసులకు లభించగా వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకు ఆ మృతదేహాన్ని గుర్తించలేని పరిస్థితి నెలకొంది. 

సీసీటీవీ దృశ్యాల ద్వారా ప్రమాదానికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నారు. కాగా సదరు వ్యక్తి రోడ్డు దాటుతుండగా.. వేగంగా వెళ్తున్న వాహనం ఢీకొట్టడం వల్లే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తర్వాత వరుసగా వాహనాలు అతడిపై నుంచి వెళ్లడంతో శరీరం పూర్తిగా ఛిద్రమై ఉండవచ్చని అంచనా వేశారు. పొగమంచు వల్ల మొదట ఢీకొన్న వాహనాన్ని గుర్తించడం కష్టంగా మారిందని చెప్పారు.
చదవండి: Film Nagar: ప్రేమోన్మాది ఘాతుకం.. వివాహితతో ప్రేమ, భర్త అడ్డొస్తున్నాడని

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)