Breaking News

ప్రియుని మోజులో.. కవలలను కడతేర్చిన కన్నతల్లి..

Published on Wed, 10/21/2026 - 11:59

డీగ్‌: రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా బడేస్రా గ్రామంలో తమ అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో 13 ఏళ్ల కవల పిల్లలను సొంత తల్లే ప్రియుడితో కలిసి పొట్టనపెట్టుకున్న దారుణ ఘటన వెలుగు చూసింది. వినయ్ చౌదరి, విష్ణు చౌదరి అనే 13 ఏళ్ల కవల సోదరులు హత్యకు గురయ్యారు.

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాకు చెందిన నిరంజన్ సింగ్‌తో ప్రీతికి 20 ఏళ్ల క్రితం వివాహం కాగా, వారికి నలుగురు పిల్లలు (18 ఏళ్ల కూతురు, 16 ఏళ్ల కొడుకు, 13 ఏళ్ల కవలలు) జన్మించారు. కొన్నేళ్ల క్రితం భర్త మరణించడంతో ప్రీతి తన పిల్లలతో కలిసి పుట్టింటి గ్రామమైన బడేస్రాకు వచ్చి ఉంటున్నారు. ఈ క్రమంలో ప్రీతి అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ సంబంధాన్ని 13 ఏళ్ల కవల పిల్లలు తీవ్రంగా వ్యతిరేకించగా, 16 ఏళ్ల పెద్ద కుమారుడు మాత్రం తల్లికి మద్దతుగా నిలిచాడు.

తమ ప్రేమకు కవల పిల్లలు అడ్డుగా మారుతున్నారని భావించిన ప్రీతి, వారిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకుంది. ఇందులో భాగంగానే తన ప్రియుడిని ఇంటికి పిలిపించి, ప్రియుడు, ఆమె 16 ఏళ్ల పెద్ద కుమారుడితో కలిసి ఈ హత్యకు కుట్ర పన్నింది. వారిద్దరి చేత కవల పిల్లల గొంతులు కోయించి  దారుణంగా హత్య చేయించింది. మృతుల శరీరాలపై కత్తిపోట్ల గుర్తులు ఉన్నాయి.

మంగళవారం తెల్లవారుజామున బయటకు వెళ్లిన పిల్లలు ఎంతకీ రాకపోవడంతో వారి మేనత్త గాలించగా, ఇంటి సమీపంలోని ఒక ఖాళీ స్థలంలో ఉదయం 6 గంటల ప్రాంతంలో విగతజీవులుగా పడి ఉన్న మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న డీగ్ జిల్లా ఎస్పీ కాంబ్లే శరణ్ గోపీనాథ్ వెంటనే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ఈ కేసులో కవల పిల్లల తల్లి ప్రీతితో పాటు ఆమె ప్రియుడిని, 16 ఏళ్ల పెద్ద కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

ఇదీ చదవండి: నిరాధార ఆరోపణలపై ఐరాసలో గళమెత్తిన భారత్‌!

#

Tags : 1

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)