Breaking News

తల్లి ఘాతుకం.. బాలిక శరీర భాగాలు పెరిగేందుకు ఇంజెక్షన్లు, టాబ్లెట్లు

Published on Sun, 06/04/2023 - 09:09

విజయనగరం (క్రైమ్‌): ఆ బాలిక తల్లి దారి తప్పింది. పెళ్లయిన కొన్నేళ్లకే మొదటి భర్తకు విడాకులిచ్చింది. ఆ తరువాత సబ్‌ ఇంజనీర్‌ను వివాహం చేసుకుంది. కొంతకాలానికి అతనితోనూ తెగతెంపులు చేసు­కుని వ్యభిచారం ప్రారంభించింది. చివరకు తన 15 ఏళ్ల కుమార్తెను కూడా వ్యభిచార కూపంలోకి దింపాలని, అనంతరం సినీ, టీవీ రంగంలోకి పంపించాలని భావించింది. ఆ బాలిక శరీర భాగా­లు విపరీతంగా పెరిగేలా.. యుక్తవయసు అమ్మా­యి­లా కనిపించేలా చేసేందుకు హార్మోన్‌ ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్లను వాడించడం మొదలుపెట్టింది.

తల్లి చేష్ట­లను భరించలేక బాధిత బాలిక 1098 నంబర్‌కు ఫోన్‌చేసి చైల్డ్‌ లైన్‌ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే.. నవోదయ పాఠశాలలో చ­దువుతున్న ఓ బాలిక ఇటీవల పదో తరగతి పరీ­క్షలు రాసి అత్యుత్తమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించింది.  ఆ బాలిక విజయనగరంలో ఉంటున్న తల్లి దగ్గరకు ఇటీవల వచ్చింది. తెలియని వ్యక్తులు తరచూ ఇంటికి రావడం.. తల్లి తనముందే వారితో వ్యభిచరించడాన్ని భరించలేక.. తల్లితో విభేదించింది. బాలికను కూడా తన మాదిరిగానే ఇంటికి వచ్చే వ్యక్తులతో చను­వుగా ఉండాలని తల్లి ఒత్తిడి చేయడాన్ని తట్టుకోలేకపోయింది.

శరీర భాగాలు పెరిగేందుకు ఇచ్చే ఇంజెక్షన్లు, టాబ్లెట్ల వల్ల అనారోగ్యానికి గురయింది. ఈ పరిస్థితుల్లో తల్లి ఒత్తిడిని తట్టుకోలేక గురువారం రాత్రి చైల్డ్‌లైన్‌ 1098కి కాల్‌ చేసి రక్షణ కోరింది. రంగంలోకి దిగిన చైల్డ్‌లైన్‌ సభ్యులు, దిశ పోలీసులు ఆ బాలికను దిశ స్టేషన్‌కు తీసుకువచ్చి విచారణ జరిపారు. బాలిక నుంచి ఫిర్యాదు తీసుకున్నాక అదే­రోజు రాత్రి స్వధార్‌ హోమ్‌కు తరలించారు.

అనంతరం విశాఖలోని ప్రభుత్వ బాలికల పునరావాస కేంద్రంలో చేర్పించారు. బాలిక సంక్షేమం చూడాలంటూ పునరావాస కేంద్రం సూపరింటెండెంట్‌కు రాష్ట్ర బాలల హక్కుల కమిషన్‌ చైర్మన్‌ కేసలి అప్పారావు సూచించారు. ఈ విషయాన్ని విజయనగరం ఎస్పీ ఎం.దీపిక దృష్టికి తీసుకువెళ్లారు. బాలిక తల్లిని అదుపులోకి తీసుకుని చిల్డ్రన్స్‌ కోర్టులో విచారణ జరిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)