Breaking News

నీ వెంటే వస్తున్నా బిడ్డా..!

Published on Sat, 12/14/2024 - 11:02

కుల్కచర్ల(వికారాబాదు జిల్లా) : కొడుకు మరణాన్ని తట్టుకోలేక.. ఓ తల్లి గుండె ఆగింది. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చూస్తుండగానే.. కుమారుడి శవం పక్కనే తుదిశ్వాస విడిచింది. ఈ విషాద సంఘటన వికారాబాద్‌ జిల్లా కుల్కచర్ల పీఎస్‌ పరిధిలోని చౌడాపూర్‌ మండలం లింగంపల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది.  గ్రామానికి చెందిన మ్యాకల శ్రీశైలం (34) గత నెల 24న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

 ఇదే ఊరికి చెందిన బాల్‌రాజ్, లక్ష్మణ్, రాములు కలిసి భూ తగాదాలతో తనను వేధిస్తున్నారని అంతకు ముందే సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మరణించాడు. శ్రీశైలం మృతిని జీర్ణించుకోలేని తల్లి వెంకటమ్మ (52) కొడుకు శవం వద్ద రోదస్తూ కింద పడిపోయింది. అక్కడున్నవారు చూస్తుండగానే ప్రాణాలు విడిచింది. దీంతో తల్లీ కొడుకుల అంత్యక్రియలను ఒకేసారి నిర్వహించారు. శ్రీశైలం ఆత్మహత్యకు కారణమైన బాల్‌రాజ్, లక్ష్మణ్, రామును అదుపులోకి తీసుకున్న పోలీసులు శుక్రవారం వారిని రిమాండ్‌కు తరలించారు. 

పోలీసులకు సవాల్‌గా మారిన విజయ హత్య కేసు


 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)