Breaking News

కసాయి తల్లి.. కన్న పిల్లల్నే చంపేసి..

Published on Thu, 04/11/2024 - 08:17

కర్ణాటక: నవమాసాలు మోసి కని పెంచిన పిల్లలను ఓ తల్లి ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీసింది. ఈ దుర్ఘటన బెంగళూరు జాలహళ్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో  చోటుచేసుకుంది. గంగాదేవి తన ఇద్దరు పిల్లలైన లక్ష్మీ (9), గౌతమ్‌ (7)లను చంపేసి పోలీస్‌ సహాయవాణికి ఫోన్‌ చేసి చెప్పింది. వివరాలు.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గంగాదేవి కుటుంబం కొన్నేళ్ల క్రితం వలసవచ్చి జాలహళ్లిలో నివాసం ఉంటుంది. ఆమె ప్రైవేటు కంపెనీలో మార్కెటింగ్‌ ఉద్యోగం చేసేది, ఆమె భర్త బీబీఎంపీ కాంట్రాక్టు పౌర కార్మికుడు.

 గత నెలలో భర్తపై గంగాదేవి ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కిందకేసు నమోదు చేసి అరెస్ట్‌చేశారు. ఇద్దరు పిల్లలతో మంగళవారం ఉగాది పండుగ చేసుకున్న గంగాదేవి అర్ధరాత్రి ఇద్దరు పిల్లలను దిండుతో ఉపిరాడకుండా చేసి హత్యచేసింది. రాత్రి 1 గంట సమయంలో పోలీస్‌ సహాయవాణికి ఫోన్‌ చేసి ఇక్కడ గొడవ జరుగుతోంది, రావాలని కోరింది. జాలహళ్లి పోలీసులు ఘటనాస్థలానికి వెళ్లగా, పిల్లలను తానే చంపానని ఆమె చెప్పిందని ఉత్తర విభాగం డీసీపీ సైదులు అడావత్‌ తెలిపారు. భర్తతో గొడవలు, ఆర్థిక సమస్యల వల్ల  మానసిక ఒత్తిడికి గురై ఈ దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. మహిళను జాలహళ్లి పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ చేపట్టారు.
 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)