Breaking News

కవితకు హైబీపీ

Published on Sat, 08/24/2024 - 04:43

సాక్షి, న్యూఢిల్లీ: మద్యం విధానం కేసులో ఆరోపణ లను ఎదుర్కొంటూ తీహార్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత హైబీపీతో సతమతం అవుతున్నట్లు తెలుస్తోంది. రెండు రోజుల కిందట ఎ యిమ్స్‌ ఆసుపత్రిలో ఆమె కు జైలు అధికారులు వైద్య పరీక్షలు నిర్వహించారు.  గైనిక్‌ టెస్టులతో పాటు డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌ టెస్టులను చేశారు. బీపీ పరీక్షించగా, 186/103 ఉన్నట్లు తెలిసింది. జైలులోకి వెళ్లిన రెండు రోజులకే కవిత హైబీపీకి గురి అయినట్లు సమాచారం.

జైలు అధికారులు రెండు పూటలా బీపీ ట్యాబ్లెట్లు ఇస్తున్నా రక్తపోటు నియంత్రణలోకి రాకపోవడంపై ఆమె కుటుంబీకుల్లో ఆందోళన నెలకొంది. మరోపక్క జ్వరం కూడా తగ్గకపోవడం, ఒకేసారి పది కేజీల బరువు తగ్గడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జైలులోకి వెళ్లే ముందు కవిత 70 కేజీల బరువు ఉండగా, ఎయిమ్స్‌ వైద్యులు నిర్వహించిన పరీక్షల సందర్భంలో ఆమె బరువు 59.5 కేజీలు ఉన్నట్లు సమాచారం. వీటికి తోడు దీర్ఘకాలికంగా ఆమెకు ఉన్న గైనిక్‌ సమస్యలు రోజు రోజుకూ ఎక్కువ అవడం వలన మరింత అనారోగ్యానికి గురవుతున్నట్లు చెబుతున్నారు.

హరీశ్‌రావు పరామర్శ: తీహార్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రతో కలిసి మాజీ మంత్రి హరీశ్‌రావు శుక్రవారం పరామర్శించారు. ఆ కేసులో దర్యాప్తు సంస్థలు కావాలనే కవితను ఇబ్బంది పెడుతున్నాయని హరీశ్‌ ఆరోపించారు. బెయిల్‌ విషయంలో దర్యాప్తు సంస్థలు వ్యవహరిస్తున్న తీరును దేశ ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని, వచ్చే మంగళవారం కవితకు బెయిల్‌ వచ్చే అవకాశం ఉందని హరీశ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)