Breaking News

ముగ్గురు గురుకుల విద్యార్థుల అదృశ్యం

Published on Thu, 09/19/2024 - 03:39

దేవరకొండ: నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లి మైనార్టీ బాలుర గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు పదవ తరగతి విద్యార్థులు అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి0ది. గుమ్మడవెళ్లికి చెందిన అబ్దుల్‌ రహమాన్, హుజూర్‌నగర్‌కు చెందిన ముజీబ్, జాన్‌ పహాడ్‌కు చెందిన తౌఫిక్‌ ఈనెల 17న పాఠశాలలో అల్పాహారం తిన్న అనంతరం సమాచారం ఇవ్వకుండా గోడ దూకి వెళ్లిపోయారు. పాఠశాల ఉపాధ్యాయులు, ఇన్‌చార్జ్‌ ప్రిన్సిప ల్‌ పరిసర ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేకపోయింది. పాఠశాలలోని సీసీ కెమెరాలను పరిశీలించగా గోడదూకి వెళ్లినట్లు గుర్తించారు.

వెంటనే విద్యార్థుల తల్లిదండ్రులకు, గురుకుల రీజనల్‌ కోఆర్డినేటర్‌ విష్ణుమూర్తికి సమాచారం అందించారు. అధికారుల సూచనల మేరకు దేవరకొండ పోలీసుల కు ఫిర్యాదు చేసినట్లు ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపల్‌ తెలిపారు. ఈ ము గ్గురు విద్యార్థులు ఈ నెల 16న పాఠశాల ప్రహరీ గోడవైపు నుంచి ఓ ప్యాకెట్‌ తీసుకుంటుండగా పాఠశాల సిబ్బంది, ఉపాధ్యాయులు గమనించి అడిగారు. అందులో కల్లు ప్యాకె ట్లు ఉండటంతో విద్యార్థులను మందలించారు. అయితే సద రు విద్యార్థులు తమకెలాంటి సంబంధం లేదని తెలిపారు. 

అందులో ఓ విద్యార్థి తమకు ఆ ప్యాకెట్లకు ఎలాంటి సంబంధం లేదని, తాము ఏ తప్పూ చేయలేదని లేఖ రాసిపెట్టాడు. తమను ఎవరూ వెతకవద్దని లేఖలో పేర్కొని ఉంది. ఈ నెల 17న వారు అదృశ్యమయ్యారు. జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ శ్రీని వాస్‌ పాఠశాలకు చేరుకొని ఆరాతీశారు. విద్యార్థుల ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అయితే, రెండు రోజు లు గడుస్తున్నా పిల్లల ఆచూకీ తెలియక పోవడంతో విద్యార్థు ల తల్లిదండ్రులు పాఠశాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)