Breaking News

మంత్రి సబిత పీఏలమంటూ నమ్మించి భారీ మోసం

Published on Wed, 05/17/2023 - 11:59

బంజారాహిల్స్‌(హైదరాబాద్‌): తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కార్యాలయ సిబ్బందిమంటూ పరిచయం చేసుకుని ప్రముఖ షూస్‌ తయారీ కంపెనీని మోసం చేసిన ఏడుగురు వ్యక్తులపై బంజారాహిల్స్‌పోలీసులు క్రిమినల్‌ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర  శిక్షా అభియాన్‌ పేరుతో ప్రభుత్వ పాఠశాలల్లో షూస్, స్కూల్‌ బ్యాగ్స్‌ పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన ఆర్డర్‌ను తమకు కేటాయించాలని హరియాణా రాష్ట్రంలోని కర్నైల్‌ పట్టణానికి చెందిన లిబర్టీ షూస్‌ లిమిటెడ్‌ సంస్థ 2019 డిసెంబర్‌లో రాష్ట్ర విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డిని కలిసి వినతిపత్రం అందజేసింది.

కొన్ని రోజుల తర్వాత విద్యాశాఖ మంత్రి పర్సనల్‌ అసిస్టెంట్‌ను అంటూ జీకే.కుమార్, సెకండ్‌పర్సనల్‌ అసిస్టెంట్‌ అంటూ బెల్లి తేజ, పోలిటికల్‌ సెక్రటరీ అంటూ ప్రవీణ్‌వర్మ తదితరులు లిబర్టీ సంస్థ ప్రతినిధి కమల్‌ ధవన్‌కు ఫోన్‌ చేశారు. షూస్‌ కాంట్రాక్ట్‌ విషయంపై మాట్లాడదామంటూ హైదరాబాద్‌కు పిలిపించారు. కాంట్రాక్ట్‌ విషయం ఫైనల్‌ చేస్తామని దీనికోసం ప్రాసెసింగ్‌ ఫీజులతో పాటు ఇతర చార్జీల కింద ఇవ్వాలంటూ రూ.17.66 లక్షలు వసూలు చేశారు.
చదవండి: HYD: మలక్‌పేట్‌లో కలకలం.. మొండెం లేని మహిళ తల లభ్యం

వివిధ అకౌంట్‌ నెంబర్లకు ఈ డబ్బును పంపించాలని సూచించారు. వారి సూచనల మేరకు డబ్బు చెల్లించిన లిబర్టీ సంస్థ ప్రతినిధులు ఏళ్లు గడుస్తున్నా కాంట్రాక్ట్‌ రాకపోవడంతో అనుమానం వచ్చి వాకబు చేయగా కుమార్‌ అనే వ్యక్తి గతంలో పనిచేసిన మాట వాస్తవమేనని, అతడిని ఉద్యోగంలోంచి తొలగించారని తేలింది. దీంతో తమను మోసం చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని లిబర్టీ షూస్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రతినిధి కమల్‌ ధావన్‌ సోమవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జీకే.కుమార్, బెల్లితేజ, ప్రవీణ్‌వర్మ, స్వాతి, విక్రమ్‌ పురి, అంజనేయులు, రమేష్‌ రెడ్డి అనే వ్యక్తులపై ఐపీసీ 406,420 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Videos

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)