Breaking News

మాంబట్టు సెజ్‌లో భారీ అగ్నిప్రమాదం

Published on Tue, 06/11/2024 - 04:38

తడ (తిరుపతి జిల్లా): పరిశ్రమల్లో లభించే పాత వస్తువులను సేకరించే ఒక సంస్థ నిబంధనలకు విరుద్ధంగా పరిశ్రమలకు సమీపంలో నెలకొలి్పన డంపింగ్‌ యార్డులో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతి జిల్లా తడలోని మాంబట్టు ఏపీఐఐసీ పారిశ్రామికవాడలో నిల్వ ఉంచిన చెత్తకు నిప్పు అంటుకోవడంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. దీంతో పొగ ఆకాశాన్ని అంటుకుని చీకట్లు కమ్మేయడంతో సమీప పరిశ్రమల్లోని కార్మికులు ఆందోళన చెందారు.

నాయుడుపేట సీఐ శ్రీనివాసులురెడ్డి, సూళ్లూరుపేట సీఐ మధుబాబు, తడ, సూళ్లూరుపేట ఎస్‌ఐలు నరశింహారావు, రహీంరెడ్డి తమ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సూళ్లూరుపేట, అపాచీ పరిశ్రమలకు చెందిన రెండు ఫైరింజన్లు మంటలు అదుపు చేసేందుకు శ్రమించాయి. మంటలతోపాటు మంటల్లో నుంచి భారీ శబ్దాలతో పేలుళ్లు వస్తుండటంతో పోలీసులు ఆ దారిన రాకపోకలు అడ్డుకుని ఇతర మార్గాల్లో వాహనాలు మళ్లించారు.

కాగా పరిశ్రమలకు సమీపంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా ఉన్న డంపింగ్‌ యార్డు వల్ల తీవ్ర ఇబ్బందులు జరుగుతాయని ఏడాది క్రితం సూళ్లూరుపేట ఫైర్‌ అధికారులు తిరుపతికి చెందిన స్థల యజమాని హర్షవర్ధన్, చెత్త సేకరించి నిల్వ చేసుకునేందుకు స్థలాన్ని లీజుకు తీసుకున్న షేర్‌ అలీ అనే వ్యక్తులకు సమాచారం ఇచ్చినా వారు పెడచెవిన పెట్టారని ఫైర్‌ సిబ్బంది తెలిపారు.  డంపింగ్‌ యార్డులో పనికి రాని చెత్త మాత్రమే కాలిపోగా ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని ఆనుకుని ఉన్న అల్యూమినియం క్యాస్టింగ్‌ కంపెనీ తీవ్రంగా నష్టపోయింది.  

Videos

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)