Breaking News

Hyderabad: భర్తను ఫంక్షన్‌ను పంపి భార్య అదృశ్యం.. స్నేహితుడిపై అనుమానం

Published on Wed, 08/23/2023 - 08:18

హైదరాబాద్: భర్తను ఫంక్షన్‌ను పంపిన భార్య అతను తిరిగి వచ్చేలోపు ఇంటి నుంచి అదృశ్యమైన సంఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగుచూసింది. ఎస్‌ఐ ఉదయ్‌ సమాచారం మేరకు... జి.ప్రశాంత్, తేజస్వినీలకు 2020 నవంబర్‌లో వివాహం అయింది. వారు రహమత్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. ప్రశాంత్‌ కొరియర్‌ బాయ్‌గా విధులు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి కిరణ్‌ తదితర యువకులు పరిచయం అయ్యారు. తరచూ ఆ యువకులు ప్రశాంత్‌ ఇంటికి వచ్చి మాట్లాడుతూ ఉండేవారు.

కిరణ్‌ కూడా తేజస్వినీని అమ్మా అని, అక్కా అని వివిధ రకాలుగా సంబోధిస్తూ తనవారుగానే ఇతరులకు పరిచయం చేసుకున్నాడు. కాగా ఈ నెల 20వ తేదీ ప్రశాంత్‌ తమకు తెలిసిన వారి ఫంక్షన్‌కు వెళదామని భార్యను అడగ్గా నీవు ఒక్కడివే వెళ్లు నేను రానని చెప్పింది. అంతేగాకుండా భర్తను అందంగా ముస్తాబు చేసి, త్వరగా ఇంటికి రమ్మని చెప్పి ఫంక్షన్‌కు పంపింది. అతను ఫంక్షన్‌కు వెళ్ల తిరిగి ఇంటికి వచ్చే సరికి భార్య కనిపించలేదు.

అంతేగాకుండా ఆమెకు సంబంధించిన దుస్తులు, నగదు, ఇతర వస్తువులు కనబడలేదు. చుట్టుపక్కల విచారించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కిరణ్‌ అనే వ్యక్తి మినహా అందరూ వచ్చి ఆమె కోసం గాలించారు. అయినా కనిపించకపోవతంతో ప్రశాంత్‌ మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్యకు పిల్లలు లేరని, కిరణ్‌ అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లి ఉండవచ్చని ఫిర్యాదులో అనుమానం వ్యక్తం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)