Breaking News

భర్త వివాహేతర సంబంధం.. భార్య ఆత్మహత్య..!

Published on Tue, 03/18/2025 - 11:23

అన్నానగర్‌: పెళ్లయిన నెల రోజులకే ఓ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై ఆర్డీఓ విచారణకు ఆదేశించారు. వివరాల్లోకి వెళితే.. చెన్నై అంబత్తూరు సమీపంలోని కొరటూరు ఆగ్రహారం ప్రాంతానికి చెందిన భూపాలన్‌ (27), భాగ్యలక్ష్మి (24) 10 సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. 

ఈ స్థితిలో నెల కిందట వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలో సెలవు దినమైన ఆదివారం భుపాలన్‌ తన స్నేహితులతో కలిసి క్రికెట్‌ ఆడేందుకు అదే ప్రాంతంలోని మైదానానికి వెళ్లాడు. సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు లోపలి నుంచి తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా భాగ్యలక్ష్మి తలుపు తీయలేదు. తాళం పగులగొట్టి లోపలికి ప్రవేశించిన భూపాలన్‌ షాక్‌కు గురయ్యాడు. 

ఇంటి పడక గదిలో భాగ్యలక్ష్మి ఉరివేసుకుని మృతి చెందింది. దీనిపై సమాచారం అందుకున్న కొరటూరు పోలీసులు అక్కడికి చేరుకుని భాగ్యలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసుల  విచారణలో భూపాలన్‌కు మరో మహిళతో వివాహేతర సంబంధం ఉందని, ఈ విషయం తెలిసి భాగ్యలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని అనుమానించి, భూపాలన్‌ను అదుపులోకి తీసుకుకి విచారణ జరుపుతున్నారు. ఈ కేసు విచారణను ఆరీ్టఓకు అప్పగిస్తామని పోలీసులు సమాచారం అందించారు.    

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)