Breaking News

కొత్త బట్టలు పెట్టినప్పుడు మర్యాద ఇవ్వలేదని..

Published on Wed, 10/25/2023 - 11:56

కర్నూలు : కల్లూరు ఎస్టేట్‌లోని జీఎస్‌ఎస్‌ కాలనీలో నివాసముంటున్న రహంతుల్లా భార్య షేక్‌ రేష్మా (22) ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. నంద్యాల జిల్లా డోన్‌ పట్టణం శ్రీనివాసనగర్‌కు చెందిన నూర్‌ అహ్మద్, మున్ని దంపతులకు ముగ్గురు కూతుర్లు సంతానం. పెద్ద కూతురు షేక్‌ రేష్మాను కల్లూరు ఎస్టేట్‌లో నివాసముంటున్న రహంతుల్లాకు ఇచ్చి గత ఏడాది అక్టోబర్‌లో వివాహం జరిపించారు. పెళ్లి సందర్భంగా రూ.4 లక్షలు కట్నం, 20 తులాల బంగారం, ఇతర వస్తువులు కానుకలుగా ఇచ్చారు. 

భర్త రహంతుల్లా హైదరాబాదులో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌. భార్యను తల్లి దగ్గర ఉంచి వారానికి ఒకసారి  కల్లూరుకు వచ్చి వెళ్లేవాడు. కొన్నాళ్లు సంసారం సాఫీగా సాగింది. చిన్నచిన్న కారణాలు చూపి అత్త ఫాతిమా, ఆడపడుచు ముస్కాన్, ఆమె భర్త జావెద్‌ వేధింపులకు గురిచేస్తున్నారని తల్లిదండ్రులకు చెప్పుకుని రేష్మ బాధ పడేది. ఇటీవల బట్టలు పెట్టినప్పుడు మర్యాద ఇవ్వలేదని భర్త  వేధిస్తున్నట్లు తల్లిదండ్రులకు చెప్పుకోవడంతో వారు పంచాయితీ పెట్టి పెద్ద మనుషుల సమక్షంలో సర్దిచెప్పారు.

 అయినప్పటికీ వేధింపులు తగ్గకపోవడంతో సోమవారం ఉదయం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు కనుగొని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. భర్తతో పాటు అత్త, ఆడపడుచు, ఆమె భర్త జావిద్‌ల వేధింపులు తట్టుకోలేకనే తన కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి నూర్‌ అహ్మద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు  చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)