Breaking News

మల్లేశంతో ప్రేమ వివాహం.. ఐదేళ్లయినా..

Published on Thu, 06/09/2022 - 08:16

సిద్దిపేటకమాన్‌ (సిద్దిపేట): పెళ్లి జరిగి ఐదేళ్లు గడిచినా సంతానం కలగడం లేదనే తీవ్ర మనస్థాపానికై గురై రంగనాయక సాగర్‌ కాల్వలో దూకి వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన సిద్దిపేట వన్‌ టౌన్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.  

ఎస్‌ఐ మల్లేశం తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట పట్టణం భరత్‌నగర్‌కు చెందిన శివాని(23)ఐదేళ్ల క్రితం కామారెడ్డి జిల్లా మాచాపూర్‌ మండలం చుక్కాపూర్‌ గ్రామానికి చెందిన మల్లేశంను ప్రేమ వివాహం చేసుకుంది. అప్పటి నుంచి వీళ్లు సిద్దిపేటలోని ముర్షద్‌గడ్డలో అద్దె ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

ఈ క్రమంలో పెళ్లి అయి ఐదేళ్లు గడిచినా సంతానం కలగక పోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన శివాని జీవితంపై విరక్తితో మంగళవారం రాత్రి భర్త ఇంట్లో లేని సమయంలో సిద్దిపేట పట్టణ శివారు ఇమాంబాద్‌ వార్డు వద్ద ఉన్న కెనాల్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఉదయం గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న కుటంబ సభ్యులు మృతురాలిని గుర్తించారు. ఘటనపై మృతురాలి అన్న కృపాల్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

చదవండి: (నిశ్చితార్థం జరిగినా.. వీడియోలతో భయపెడుతూ పలుమార్లు అత్యాచారం)

Videos

జగన్ ఫోటో తొలగింపు.. టీడీపీ నేతలపై గోరంట్ల మాధవ్ ఫైర్

25 వేల మంది ఆధారపడి ఉన్నారు వాళ్ల కుటుంబాల పరిస్థితి ఏంటి

హార్వర్డ్ యూనివర్సిటీపై మరోసారి ట్రంప్ సర్కారు కొరడా

టీడీపీలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గు పడుతున్న.. బండారు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

మై డియర్ డాడీ.. కేసీఆర్ కు కవిత సంచలన లేఖ

Big Question: బాబుకు బాదుడే బాదుడు.. అతిపెద్ద కుంభకోణం

ఎల్లోమీడియాను ఉతికి ఆరేసిన వైఎస్ జగన్

తిరుమలలో మరో అపచారం

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

Photos

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)