Breaking News

తలకిందులుగా వేలాడదీసి..కింద మంట పెట్టి...

Published on Sun, 09/03/2023 - 01:31

మందమర్రి రూరల్‌: మంచిర్యాల జిల్లా మంద­మర్రిలో దారుణం చోటు చేసుకుంది. మేకలు దొంగతనం చేశారని ఇద్దరు యువకులను కట్టేసి చిత్రహింసలు పెట్టారు. తలకిందులుగా వేలాడ­దీసి, కింద మంటపెట్టి నరకం చూపించారు. అవ­మానం భరించలేక ఓ యువకుడు కనిపించకుండా పోయాడు. అతని చిన్నమ్మ శనివారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా విష­యం వెలుగులోకి వచ్చింది.

మందమర్రి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని యాపల్‌ ఏరియా సమీపంలోని అబ్రహం నగర్‌కు చెందిన చాకలి రాములుకు కొన్ని మేకలు ఉన్నాయి. ఆ మేకలను కాసేందుకు తేజ అనే యువకుడిని కూలీగా పెట్టుకున్నాడు. అయితే మేకల షెడ్డు వద్ద ఉన్న ఓ పైపు, ఒక మేక ఇటీవల చోరీ అయ్యాయి. అదే ఏరియాకు చెందిన కిరణ్‌ ఈ పని చేసి ఉంటాడన్న అనుమానంతో రాములు పిలిచి ప్రశ్నించాడు. దీంతో తడబడిన కిరణ్‌ పైపు దాచిన చోటు చూపించాడు. తర్వాత చోరీ అయిన మేక గురించి కూడా ఆరా తీయగా స్థానికులు మేక­ను కూడా కిరణే ఎత్తుకెళ్లి అమ్ముకున్నాడని ఆరోపించారు.

దీంతో ఆగ్రహించిన రాములు నిందితుడిని తాళ్లతో కట్టేసి తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలు పెట్టాడు. అంతటితో ఆగకుండా కింద మంట పెట్టాడు. చిత్రహింస భరించలేక కిరణ్, తనకు మేకల కాపరి తేజ సహకరించాడని చెప్పా­డు. దీంతో అతడిని కూడా తీసుకువచ్చి షెడ్డులో కట్టేసి రాములు, అతని కుటుంబ సభ్యులు చిత్ర­హింసలు పెట్టారు. తర్వాత పెద్దమనుషుల వద్ద పంచాయితీ పెట్టగా మేకకు రూ.6 వేలు ఇవ్వాలని తీర్మానం చేశారు. ఇందుకు నిందితులు అంగీకరించారు.

కిరణ్‌ చిన్నమ్మ ఫిర్యాదుతో..
ఘటన అనంతరం అవమాన భారంతో కిరణ్‌ కనిపించకుండాపోయాడు. దీంతో రాములు, అతని కొడుకు శ్రీనివాస్, భార్య స్వరూప, అతని వద్ద పనిచేసే నరేశ్‌ రెండు రోజుల క్రితం తన అక్క కొడుకు కిరణ్‌ను తీవ్రంగా హింసించారని కిరణ్‌ చిన్నమ్మ నిట్టూరి సరిత శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అవమానం భరించలేక తన అక్క కొడుకు కిరణ్‌ కనిపించకుండా పోయాడని తెలిపింది. కిరణ్‌ దళితుడు కావడంతో నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు ఎస్సై చంద్రకుమార్‌ పేర్కొన్నారు. ఘటన స్థలాన్ని బెల్లంపల్లి ఏసీపీ పంతాటి సదయ్య శనివారం పరిశీలించారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)