Breaking News

ఢిల్లీలో ట్రిపుల్ మర్డర్ కలకలం.. తెల్లారితే పెళ్లి రోజు.. ఆలోపే!

Published on Wed, 12/04/2024 - 12:07

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ట్రిపుల్‌ మర్డర్‌ కలకలం రేపుతోంది. ఒకే కుటుంబానికి ముగ్గురు వ్యక్తులు దారుణ హత్యకు గురయ్యారు, దక్షిణ ఢిల్లీలోని నెబ్‌ సరాయ్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన వెలుగుచూసింది. స్థానిక నెబ్‌సరాయి ప్రాంతంలో దంపతులు తమ కుమారుడు, కుమార్తెతో కలిసి నివసిస్తున్నారు. 

బుధవారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంట్లోకి చొరబడి దంపతులు రాజేష్‌(55), కోమల్‌(47), వారి కుమార్తె కవిత(23)లపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేసి హత్య చేశారు.మార్నింగ్ వాక్‌కు వెళ్లిన ఆయన కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు.

అయితే కొడుకు తన  మార్నింగ్ వాక్ కోసం ఉదయం 5 గంటలకు ఇంటి నుండి బయలుదేరాడు. అతను ఇంటికి తిరిగి వచ్చేసరికి.. తన తల్లిదండ్రులు,  సోదరి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి షాక్‌ అయ్యాడు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.  తన తండ్రి రాజేష్‌ ఆర్మీలో పని చేసి రిటైర్‌ అయ్యాడని తెలిపాడు.

డిసెంబర్‌ 4(నేడు) తమ తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం ఉందని.. ఇందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. తెల్లారితే వారితో సంతోషంగా జరుపుకుందామనుకునేలోపు ఈ దారుణం చోటుచేసుకుందని కుమారుడు కన్నీరుమున్నీరయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో ఎలాంటి వస్తువులు దొంగతనం జరగలేదని తెలిపారు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నామని.. దర్యాప్తు కొనసాగుతోందని పేర్కొన్నారు. 

Videos

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు