Breaking News

లోన్‌ తీసుకుని మరీ మరదలు హత్యకు సుపారీ

Published on Mon, 02/03/2025 - 01:05

ముజఫర్‌నగర్‌: లోన్‌ తీసుకుని మరీ.. మరదలిపై సామూహి క అత్యాచారం, హత్య చేయించాడో ప్రభుద్ధుడు. ఈ దారుణ ఘటన యూపీలోని మీరట్‌లో జరిగింది. ముజఫర్‌నగర్‌కు చెందిన ఆశిష్‌ అనే వ్యక్తి.. తన భార్య చెల్లెలితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు.. ఆమెను వదిలించుకోవాలనుకున్నాడు. చంపేంత ధైర్యం ఒక్కడికే లేదు. అందుకోసం ఇద్దరు మనుషులను మాట్లాడుకున్నాడు. వారికి చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో రూ.40 వేలు అప్పుగా తీసుకుని మరీ శుభమ్, అతని స్నేహితుడు దీపక్‌కు చెల్లించాడు.  జనవరి 21న బాధితురాలికి కాల్‌ చేసి రప్పించారు. 

స్కూటర్‌పై మీరట్‌లోని నాను కాలువ సమీపంలోకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తరువాత కండువాతో గొంతు నులిమి చంపేశారు. మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి తగులబెట్టి.. ఎక్కడి వాళ్లక్కడ వెళ్లిపోయారు. 21న ఇంటి నుంచి వెళ్లిపోయిన అమ్మాయి ఎంతకీ రాకపోవడం, ఫోన్‌ పనిచేయకపోవడంతో జనవరి 23న కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చివరిసారి ఆశిష్, శుభం, దీపక్‌లతో కనిపించినట్లు తేలింది. ఆశిశ్‌ను విచారించడంతో నేరాన్ని అంగీకరించాడు. మరదలు బ్లాక్‌మెయిల్‌ చేయడంవల్లే చంపాల్సి వచ్చిందని చెప్పాడు. ఘటనా స్థలం నుంచి బాధితురాలి అవశేషాలు, కాలిపోయిన దుస్తులు, ఉంగరం, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)