Breaking News

ఒకటి నుంచి 50 వరకూ రాయలేదని..

Published on Sat, 01/24/2026 - 13:08

ఫరీదాబాద్‌: హర్యానాలోని ఫరీదాబాద్‌లో సభ్య సమాజం తలదించుకునే అమానుష ఘటన వెలుగు చూసింది. కేవలం హోంవర్క్ చేయలేదన్న చిన్న కారణంతో ఓ కసాయి తండ్రి తన నాలుగేళ్ల కూతురిని అతి కిరాతకంగా హతమార్చాడు. బల్లబ్‌గఢ్‌కు చెందిన కృష్ణ జైస్వాల్ (31) తన కుమార్తె వంశిక (4) హోంవర్క్‌లో ఒకటి నుండి 50 వరకు అంకెలు రాయలేకపోయిందన్న కోపంతో విచక్షణ కోల్పోయాడు. చపాతీలు చేసే కర్రతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆ చిన్నారి కుప్పకూలిపోయింది.

అనంతరం, నిందితుడు ఈ హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. తీవ్రంగా గాయపడిన  కుమార్తెను బల్లబ్‌గఢ్‌లోని సివిల్ ఆసుపత్రికి తీసుకువెళ్లి, మెట్లపై నుంచి జారిపడిందని వైద్యులను నమ్మించే ప్రయత్నం చేశాడు. ఆమె శరీరంపై పలు గాయాలు, ఫ్రాక్చర్లు, తలకు తీవ్రమైన దెబ్బలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తొలుత ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ మార్చురీకి తరలించారు.

ఈ ఘాతుకం జరిగిన సమయంలో ఇంట్లోనే ఉన్న నిందితుని ఆరేళ్ల కుమారుడు  నిజాన్ని బయటపెట్టాడు. తన సోదరి అంకెలు రాయలేకపోయినందుకు తండ్రి ఎలా  కొట్టాడో ఆ బాలుడు తన తల్లికి, ఆపై పోలీసులకు వివరించాడు. భార్య ఫిర్యాదు, బాలుని వాంగ్మూలం ఆధారంగా  నిందితుడు కృష్ణ జైస్వాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన పోలీసులు అతనిని ఫరీదాబాద్ కోర్టులో హాజరుపరిచారు. తదుపరి విచారణ నిమిత్తం న్యాయస్థానం అతడిని ఒక రోజు పోలీస్ రిమాండ్‌కు పంపింది. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)