పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ
Breaking News
ఆర్థిక ఇబ్బందులు, తరచూ భార్యతో గొడవలు.. పొద్దున్న తలుపు తెరచి చూస్తే..
Published on Fri, 10/15/2021 - 07:34
సాక్షి,రాజేంద్రనగర్( హైదరాబాద్ ): సెల్ఫీ వీడియో తీసుకోని ఓ ఫోటోగ్రాఫర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ కనకయ్య తెలిపిన మేరకు.. బండ్లగూడ ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్(30) కరోనా నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. దీనికి తోడు భార్యభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి.
బుధవారం రాత్రి సెల్ఫీ వీడియో తీసుకోని ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వీడియోలో భార్యతో పాటు బావమరిది వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని వివరించాడు. ఉదయం ఇంట్లో నుంచి చంద్రశేఖర్ బయటకు రాకపోవడంతో స్థానికులు రాజేంద్రనగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చరికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: న్యూడ్ వీడియోలతో యువకున్ని వేధిస్తున్న యువతి
Tags : 1