Breaking News

స్నేహితులతో మద్యం తాగుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో..

Published on Sat, 03/11/2023 - 13:57

సాక్షి, హైదరాబాద్‌:  మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తికి గుండెపోటు రావడంతో మృతి చెందిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కార్మికనగర్‌లో నివసించే మల్లె రామారావు(35) సెంట్రింగ్‌ వర్కర్‌. భార్య, పిల్లలు ఈ నెల 7న పెద్దపల్లిలో ప్రార్థనకు వెళ్లగా రామారావు ఒక్కడే ఇంట్లో ఉంటున్నాడు. గురువారం రాత్రి జవహర్‌నగర్‌లోని సతీష్‌ వైన్స్‌ వద్ద మద్యం తాగేందుకు వెళ్లాడు. అక్కడే నలుగురు స్నేహితులతో కలిసి మద్యం తాగుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

వెంటనే ఆయనను అంబులెన్స్‌లో ఆస్పత్రికి చేర్చగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే స్నేహితులతో జరిగిన గొడవలో మద్యం మత్తులో ఇద్దరు స్నేహితులు పిడిగుద్దులు గుద్దడం వల్లే రామారావు మృతి చెందినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వైరల్‌ అయ్యాయి. దీంతో జూబ్లీహిల్స్‌ పోలీసులు ఇక్కడి సీసీ ఫుటేజీలను పరిశీలించగా,  ముగ్గురు యువకులు గొడవ పడుతున్నట్టు నిర్ధారణ అయింది. అయితే, ఆ గొడవకు రామారావు చాలా దూరంలో ఉన్నట్లు గుర్తించారు.

ఘటనా స్థలంలో లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు రామారావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఒంటిపైన ఎలాంటి గాయాలు లేవని కార్డియక్‌ అరెస్ట్‌ వల్లే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. మద్యం మత్తులో గుండెపోటు రాగా వెనక్కి కుప్పకూలాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. మృతుడి భార్య వరలక్ష్మి ఇచి్చన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతి కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి