Breaking News

ఏడు నెలల గర్భిణి..పెళ్లి చేసుకోవాలని అడిగిన ప్రేయసి..అడవిలోకి తీసుకెళ్లి

Published on Tue, 04/11/2023 - 08:08

నాగర్‌కర్నూల్‌: పెళ్లి చేసుకోమని ప్రియురాలు గట్టిగా అడుగుతుండటంతో శ్రీశైలంలో చేసుకుందామంటూ నల్లమల అడవిలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి దహనం చేసిన ఓ కిరాతకుడి ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జడ్చర్ల సీఐ రమేష్‌బాబు తెలిపిన వివరాలిలా..

నాగర్‌కర్నూల్‌ జిల్లా తిమ్మాజిపేట మండలం గొరిటకు చెందిన లక్ష్మి అలియాస్‌ రత్నమ్మ(34) మూడేళ్ల క్రితం భర్తతో గొడవ పడి దూరంగా ఉంటూ.. కూలి పనులకు వెళ్లే క్రమంలో అదే గ్రామానికి చెందిన లింగన్‌ చెన్నయ్యతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా,  చెన్నయ్యకు మరో యువతితో వివాహం కాగా.. లక్ష్మి గొడవపడి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ పెట్టడంతో రూ.లక్ష జరిమానా చెల్లించాడు. గతేడాది చెన్నయ్య భార్య గర్భిణిగా ఉండడంతో మళ్లీ లక్ష‍్మికి దగ్గరయ్యాడు.

ప్రస్తుతం లక్ష్మి కూడా 7 నెలల గర్భిణి. ఈ సమయంలో తననూ పెళ్లి చేసుకోవాలని, తన పేరిట 2 ఎకరాల భూమి రాసివ్వాలని లేకపోతే గ్రామానికి వచ్చి గొడవ చేస్తానని చెన్నయ్యపై ఒత్తిడి తెచ్చింది. దీంతో ఎలాగైనా ఆమెను అంతమొందించాలని చెన్నయ్య పథకం వేశాడు. 

పక్కా ప్లాన్‌ ప్రకారమే..  
శ్రీశైలంలో పెళ్లి చేసుకుందామని నమ్మించి ఫిబ్రవరి 28న జడ్చర్ల నుంచి తన బైక్‌పై లక్ష్మిని తీసుకెళ్లాడు. మార్గమధ్యలో ఫర్హాబాద్‌– మన్ననూర్‌ మధ్యలో తాళ్ల చెరువు వద్ద నల్లమల అడవిలోకి వెళ్లారు. అక్కడ కర్రతో ఆమె తలపై బాది గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం బైక్‌లో ఉన్న పెట్రోల్‌ తీసి మృతదేహంపై చల్లి కాల్చివేశాడు. ఈ క్రమంలో తన కూతురు కనిపించడం లేదంటూ చెన్నయ్యపై అనుమానం వ్యక్తం చేస్తూ హతురాలి తల్లి చెన్నమ్మ మార్చి 25న జడ్చర్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

పరారీలో ఉన్న చెన్నయ్యను సోమవారం స్థానిక నిమ్మబాయిగడ్డ వద్ద పోలీసులు పట్టుకుని విచారించగా తానే హత్య చేసినట్లు అంగీకరించాడు. అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. కాగా నిందితుడు చెన్నయ్యపై గతంలో తిమ్మాజిపేట పోలీస్‌స్టేషన్‌లో ఓ ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం చేసిన కేసు కూడా నమోదైందని, .మూడేళ్ల జైలుశిక్ష కూడా అనుభవించాడని సీఐ తెలిపారు.
చదవండి: బీటెక్‌ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణ.. భర్త, ఆడపడచుతో గొడవ.. బ్యాంకుకు వెళ్తున్నానని చెప్పి...

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)