Breaking News

Loan App: నకిలీ లెటర్‌తో రూ.కోటి కొట్టేశాడు..! 

Published on Tue, 06/01/2021 - 06:38

సాక్షి, సిటీబ్యూరో: అక్రమ మైక్రోఫైనాన్సింగ్‌ వ్యవహారాలకు పాల్పడిన లోన్‌ యాప్స్‌ కేసులో కొత్త ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ఓ పక్క ఈ కేసుల దర్యాప్తు పూర్తి చేసిన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు న్యాయస్థానంలో అభియోగపత్రాలు దాఖలు చేశారు. మరోపక్క కొత్త ఎత్తు వేసిన ఓ సైబర్‌ నేరగాడు పోలీసులు ఫ్రీజ్‌ చేసిన బ్యాంకు ఖాతాను డీ–ఫ్రీజ్‌ చేయించాడు. అందులో ఉన్న రూ.1.18 కోట్లు ఓ వ్యక్తిగత ఖాతాలోకి బదిలీ చేశాడు.

దీనిపై సోమవారం కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో అక్రమ వ్యవహారాలకు పాల్పడ్డ 32 కంపెనీలకు చెందిన బ్యాంకు ఖాతాలను గుర్తించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రూ.400 కోట్లకుపైగా ఫ్రీజ్‌ చేశారు. ఈ ఖాతాల్లో కోల్‌కతాలోని ఐల్‌పోరే ప్రాంతంలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులోది కూడా ఉంది. ఈ ఖాతాను పోలీసులు గత ఏడాది డిసెంబర్‌లో స్తంభింపచేశారు.  అయితే ఇటీవల ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ బ్యాంక్‌ మేనేజర్‌ను సంప్రదించి.. తాను ఎస్‌ఐగా పనిచేస్తున్నట్లు పరిచయం చేసుకున్నాడు.

హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు రాసినట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. వీటిని ఆ మేనేజర్‌కు అందించి ఖాతాను డీ–ఫ్రీజ్‌ చేయించాడు. ఆపై గత నెల 13నరూ.1,18,70,779 స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆనంద్‌ జన్ను పేరుతో ఉన్న ఖాతాలోకి బదిలీ చేసి స్వాహా చేశాడు. గత నెల 20 మరికొంత మొత్తం ట్రాన్స్‌ఫర్‌ చేయించడానికి ప్రయత్నించాడు. దీనిని సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గుర్తించారు.దీంతో బ్యాంకు రీజనల్‌ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
చదవండి: భార్యాభర్తల తరహాలో జీవితం.. మూడుసార్లు అబార్షన్‌: నటి చాందిని

Videos

తోకముడిచి కాల్వ .. చర్చకు డుమ్మా

పిఠాపురం నియోజకవర్గంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ హెల్త్ సెక్రటరీ

ఆవకాయ కోసం యూరప్ నుంచి ఇండియాకు వచ్చిన విదేశీయులు

మా కుటుంబాన్ని మొత్తం రోడ్డున పడేసాడు.. రేషన్ డోర్ డెలివరీ ఆపరేటర్ ఫైర్..

కూటమి ప్రభుత్వంపై స్టీల్ ప్లాంట్ కార్మికులు తీవ్ర ఆగ్రహం

కూటమి ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి కామెంట్స్

సిరాజ్ ను పోలీస్ కస్టడీకి ఇచ్చిన ప్రత్యేక కోర్టు

Pithapuram: పవన్ ఇలాకాలో మట్టి మాఫియా

సోనియాగాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ సంచలన ఆరోపణలు

Major Encounter: భారీ ఎన్‌కౌంటర్లో 25 మంది మృతి.. మరికొందరికి గాయాలు

Photos

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)

+5

'శ్రీదేవి'ని గుర్తుచేస్తూ కేన్స్‌లో తొలిసారి మెరిసిన జాన్వీ కపూర్‌ (ఫొటోలు )

+5

మోహన్ లాల్ బర్త్‌డే ప్రత్యేకం.. ఆయన ప్రాణ స్నేహితుడు ఎవరో తెలుసా? (ఫోటోలు)

+5

ముంబైలో 'థగ్‌ లైఫ్‌' టీమ్‌.. ఓటీటీ విడుదలపై ప్రకటన (ఫోటోలు)

+5

గోవాలో స్నేహితుల‌తో ఎంజాయ్ చేస్తున్న మ‌ను భాక‌ర్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత లండన్‌ హనీమూన్‌లో టాలీవుడ్ నటి అభినయ (ఫోటోలు)