బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో మేడం మాయ.. చేసే పని ఇదే..

Published on Mon, 12/02/2024 - 13:03

న్యూఢిల్లీ: పంజాబీ గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్‌తో పాటు అతని గ్యాంగ్‌కు అంతకంతకూ ఉచ్చు బిగుస్తోంది. ‘మేడమ్ మాయ’తోపాటు ఈ ముఠాలోని నలుగురు సభ్యులను జైపూర్ పోలీసులు అరెస్టు చేశారు. లారెన్స్ బిష్ణోయ్ మేడమ్ మాయకు  ప్రత్యేకమైన పనులను ఇచ్చేవాడని సమాచారం.

మేడమ్ మాయ జైలులో ఉన్న లారెన్స్ బిష్ణోయ్ అనుచరులతో సన్నిహితంగా మెలుగుతుంటారు. దీనితో పాటు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సందేశాలను సంబంధితులకు అందజేసే పనిని మేడం మాయనే చేస్తుంటారు. గ్యాంగ్‌లో మేడమ్ మాయకు ఎంతో ప్రాధాన్యత ఉందని పోలీసుల విచారణలో తేలింది. ఏ ముఠా సభ్యునికి బెయిల్ ఇవ్వాలో, ఏ నేరస్తుని ఏ జైలు నుండి ఎక్కడికి మార్చాలో మేడమ్ మాయనే డిసైడ్‌ చేస్తుంటారు.

రాజస్థాన్‌లోని జైపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మేడమ్ మాయ ఈ ముఠాలో రెండేళ్లుగా పనిచేస్తున్నారు. జైలులో ఉన్న లారెన్స్ గ్యాంగ్ సభ్యుల పూర్తి వివరాలు మేడమ్ మాయ వద్ద ఉన్నాయి. జైలులో ఉన్న నేరస్తులు అందించే సందేశాలను ఆమె స్థానిక ముఠాకు చేరవేస్తుంటారు. విదేశాల్లో ఉంటున్న పలువురు నేరస్తులతో ఆమెకు మంచి పరిచయాలున్నాయి.

మహిళా నేరస్తురాలు మేడం మాయ అసలు పేరు సీమా అలియాస్ రేణు. బిష్ణోయ్‌ గ్యాంగ్‌లో ఆమెను మేడమ్ మాయ అని పిలుస్తారు. మేడమ్ మాయపై జైపూర్, ఢిల్లీ, హర్యానాలలో పలు కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఈ ముఠాలోని ఏడుగురు నేరస్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె జైపూర్‌లో ఓ వ్యాపారిపై కాల్పులు జరిపేందుకు ప్లాన్‌ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఇది కూడా చదవండి: దిగొచ్చిన బంగారం.. ఇక కొందాం..

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)