Breaking News

మార్కులు తగ్గాయని ఇంట్లో నుంచి వెళ్లి.. రూ.కోటి ఇవ్వాలంటూ తండ్రికి మెసేజ్‌!

Published on Sun, 05/21/2023 - 17:07

కోల్‌కతా: పరీక్షల్లో మార్కులు తగ్గితే కొందరు విద్యార్థులు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ 16 ఏళ్ల బాలిక పరీక్షల్లో మార్కులు తగ్గడంతో తల్లిదండ్రులు తిడతారని భయంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. అంతటితో ఆగకుండా తనని కిడ్నాప్‌ చేశారని నాటకమాడి తన తండ్రి నుంచి కోటి వసూలు చేయాలని ప్రయత్నించింది. ఈ షాకింగ్‌ ఘటన కోల్‌కతాలో చోటు చేసుకుంది.

వివరాల ప్రకారం.. పరీక్షల ఫలితాలు విడుదల కావడంతో తన మార్కులను తెలుసుకునేందుకు సైబర్ కేఫ్‌కి తన 6 ఏళ్ల సోదరితో కలిసి తన ఇంటి నుంచి బయలుదేరింది. ఎంతసేపటికి ఆమె తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు బాలికకు ఫోన్‌ చేసేందుకు ప్రయత్నించినా అందుబాటులోకి రాలేదు. వాళ్లు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టారు. దీంతో పోలీసులు అక్కాచెల్లెళ్ల కోసం గాలింపు మొదలుపెట్టారు.

అదే సమయంలో, బాలిక తండ్రికి గుర్తుతెలియని నంబరు నుంచి ఓ మెసేజ్‌ వచ్చింది. తన కుమార్తెలిద్దర్నీ కిడ్నాప్‌ చేశామని, రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతామని అందులో ఉంది. దీంతో పోలీసులు ఆ ఫోన్‌ నంబరు ఆధారంగా చివరకు నదియా జిల్లాలోని ఓ నర్సింగ్‌ హోం ఎదుట వారు ఉన్నట్లు గుర్తించి కాపాడారు. అయితే విచారణలో వారు కిడ్నాప్‌ కాలేదని ఇది డ్రామా అని తెలిసి అవాక్కయ్యారు. తల్లిదండ్రులకు భయపడి తానే ఈ నాటకమాడినట్లు బాలిక కూడా అంగీకరించింది.

చదవండి: ‘మోసం చేసింది.. నా లవర్‌ బర్త్‌డే రోజునే చనిపోతున్నా’.. సెల్ఫీ వీడియో తీసుకుని..

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)