Breaking News

బడికి పోయినా బతికెటోడు..

Published on Thu, 03/28/2024 - 09:32

పాపం.. ఆ చిన్నారి బడికి పోయినా బతికెటోడు. మాయదారి మృత్యువు మాటువేసి కాటువేసింది. పాఠశాలకు వెళ్లకుండా చిన్నారిని ఏమర్చి తండ్రితో వస్తాయని మారం చేయించింది. ఈ విషయంలో తండ్రితో కూడా సరేననిపించి చివరకు రోడ్డు ప్రమాద రూపంలో అమాంతం బలితీసుకుంది.  ఫలితంగా ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగింది.

జనగామ: ఎండు మిర్చిని విక్రయించేందుకు  తండ్రితో కలిసి వెళ్లిన కొడుకు.. రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన జనగామ మండలం పెంబర్తి కాకతీయ కళాతోరణం సమీపంలో జరిగింది. ఎస్సై తిరుపతి కథనం ప్రకారం రఘునాథపల్లి మండలం నక్కబొక్కలతండా శివారు సోమయ్య కుంట తండాకు చెందిన గుగులోత్‌ తిరుపతి, గంగా దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు  ఉంది. తిరుపతి తన సొంత ఆటోలో ఎండు మిర్చితో పాటు సీజనల్‌ వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. 

ఈ క్రమంలో బుధవారం ఊరూరా తిరిగి ఎండు మిర్చి విక్రయించేందుకు బయలుదేరగా.. పెద్ద కుమారుడు ఈశ్వర్‌ (07) తండ్రితో వెళ్తానని మారం చేయడంతో వెంట తీసుకెళ్లాడు. పటేల్‌ గూడెంలో ఎండు మిర్చి అమ్ముకుని... పెంబర్తి కాకతీయ కళాతోరణం సమీపంలో ఆలేరు వైపునకు యూటర్న్‌ చేసుకుంటున్న సమయంలో హైదరాబాద్‌ నుంచి వస్తున్న కారు.. ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో తండ్రితో కలిసి ముందు సీటులో కూర్చున్న ఈశ్వర్‌ అక్కడిక్కడే మృతి చెందగా.. తిరుపతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అదే కారులో ఈశ్వర్‌తో పాటు తిరుపతిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 

వైద్యులు పరీక్షించి బాలుడు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించగా, తండ్రికి వైద్య పరీక్షలు చేశారు. కాగా, తమ కుమారుడు మృతి చెందాడని తెలియగానే తల్లిదండ్రులు కుప్ప కూలిపోయారు. కుటుంబ సభ్యులు, బంధువులు ఆస్పత్రికి చేరుకోవడంతో రోదనలు మిన్నంటాయి. జిల్లా కేంద్రంలోని అరబిందో స్కూల్‌లో ఒకటో తరగతి చదువుకుంటున్న ఈశ్వర్‌.. బడికి వెళ్లినా బతికెటోడేమోనంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)