Breaking News

‘కవిత సీబీఐ విచారణ’ కేసు 26కు వాయిదా 

Published on Thu, 04/11/2024 - 04:19

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా సీబీఐ జైలులో విచారించడాన్ని సవాల్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై రౌజ్‌ అవెన్యూ కోర్టు విచారణ వాయిదా వేసింది. ఈ పిటిషన్‌ను బుధవా రం ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా విచారించారు. కవిత దాఖలు చేసిన పిటిషన్‌లో సీబీఐ రిప్లై ఇవ్వలేదని న్యాయవాది నితీష్‌ రాణా ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.

రిప్‌లై ఇవ్వా లని కోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ ఇవ్వకుండానే కవితను విచారించారన్నారు. శనివారం సాయంత్రం కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా సీబీఐ బేఖా తరు చేసిందన్నారు. దీనిపై తమ వాదనలు వినాలని కోరారు. అప్పటి వరకూ విచారణ అనుమతిపై స్టే ఇవ్వాలని కోరారు.

అనంతరం, సీబీఐ తరఫు న్యాయ వాది వాదనలు విని పిస్తూ కవితను విచారించడానికి కోర్టు అనుమతి ఇచ్చిన తర్వాతే శనివారం మధ్యాహ్నం జైలులో విచారించామని ఈ నేపథ్యంలో కౌంటరు దాఖలు చేయాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇరు పక్షాల వాదనల తర్వాత... భవిష్యత్తులో విచారణ చేస్తే ముందుగా అప్లికేషన్‌ దాఖలు చేయాలని సీబీఐకు న్యాయమూర్తి సూచించారు. ఈ నెల 26న విచారణ చేపడతామని న్యాయమూర్తి వాయిదా వేశారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)