Breaking News

ధార్వాడ్‌లో ఘోరం.. ఇంట్లోనే డాక్టర్ దారుణ హత్య

Published on Wed, 07/15/2026 - 23:18

కర్ణాటకలోని ధార్వాడ్‌లో బుధవారం ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. బారాకోట్రి ప్రాంతంలో అనస్థీషియాలజిస్ట్ కిరణ్ హోనన్నవర్(45)ను గుర్తుతెలియని దుండగులు తన అపార్ట్‌మెంట్‌లోనే అత్యంత కిరాకతంగా హత్య చేశారు. ఆయన ఎనిమిదేళ్ల కుమారుడు సైతం తీవ్రమైన కత్తిపోట్లకు గురయ్యాడు.

ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న బాలుడిని వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి మృతుడి భార్య, ఆప్తమాలజిస్ట్ అయిన డాక్టర్ ప్రియాంకను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ధార్వాడ్ పోలీస్ కమిషనర్ ఎన్. శశికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. "ఈ ఘటన జరిగిన అపార్ట్‌మెంట్ అత్యంత భద్రత కలిగిన ప్రాంతంలో ఉంది. 

మా ప్రాథమిక విచారణలో ఘటన జరిగిన సమయంలో ఇంట్లోకి బయటి వ్యక్తులు ఎవరూ ప్రవేశించినట్లు ఆధారాలు లభించలేదు. ఆ సమయంలో ఇంట్లో కేవలం డాక్టర్ కిరణ్, ఆయన భార్య ప్రియాంక, వారి కుమారుడు మాత్రమే ఉన్నారు" అని  పేర్కొన్నారు.

ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో వెలుగులోకి..
కాగా డాక్టర్ కిరణ్ బంధువులు ఆయనకు వరుసగా ఫోన్ చేయగా ఎలాంటి స్పందన రాలేదు. ఈ క్రమంలో ఆయన భార్య ప్రియాంకకు ఫోన్ చేశారు. అయితే ఆమె పొంతన లేని సమాధానాలు చెప్పింది. దీంతో  అనుమానం వచ్చి బంధువులు నేరుగా అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు.

అక్కడికి వచ్చి చూడగా  ఒక గదిలో డాక్టర్ కిరణ్ మృతదేహం, మరో గదిలో గాయపడిన బాలుడు పడి ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు మృతుడి భార్యను విచారిస్తున్నారు. ఆమె పోలీసులకు కూడా పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ దారుణ ఘటనకు కుటుంబ కలహాలే కారణమై ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు. అయితే కిరణ్ కుటంబ సభ్యులు మాత్రం డాక్టర్ ప్రియాంకనే ఈ హత్యకు ఒడిగట్టారని ఆరోపిస్తున్నారు.

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)