Breaking News

భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్ర తీసుకున్న మహిళ.. చివరకు..

Published on Wed, 12/14/2022 - 15:00

బెంగళూరు: కర్ణాటక బెంగళూరులో ప్రీతి కుశ్వాహా అనే 33 ఏళ్ల మహిళ భర్తకు తెలియకుండా అబార్షన్ మాత్రం తీసుకుంది. దీని వల్ల సమస్యలు తలెత్తి తీవ్ర రక్తస్రావమైంది. ఆస్పత్రికి తరలించగా ఆమె అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ దంపతులకు 11 నెలల చిన్నారి ఉంది. అయితే ఇటీవల వైద్య పరీక్షలు నిర్వహించగా ప్రీతి మళ్లీ గర్బం దాల్చినట్లు తేలింది. ఇప్పటికే చిన్న పాప ఉన్నందున ఇంత త్వరగా మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఆమె విముఖత వ్యక్తం చేసింది. అబార్షన్ చేయించుకుంటానని భర్తకు చెప్పగా.. అందుకు అతను ఒప్పుకోలేదు.

అయితే సోమవారం సాయత్రం భర్త బయటకు వాకింగ్‌కు వెళ్లినప్పుడు ప్రీతి అబార్షన్ మాత్ర తెచ్చుకుని వేసుకుంది. దీంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తాయి. భరించలేని కడుపునొప్పితో పాటు రక్తస్రావమైంది. భర్త ఆస్పత్రికి తీసుకెళ్తానంటే ఆమె వద్దంది. 

కానీ మంగళవారం ఉదయం ప్రీతి స్పృహ తప్పి పడిపోయి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. ఆమె భర్త హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. అయితే ప్రీతి అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించడంతో తీవ్ర దుఃఖంలో మునిగిపోయాడు.

ఈ ఘటనపై పోలీసులు ‍అసహజ మరణంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అబార్షన్ మాత్ర వల్లే మహిళ చనిపోయినట్లు ప్రాథమిక నిర్ధరణకు వచ్చారు. అనుమానాస్పదంగా ఏమీ కన్పించడంలేదని పేర్కొన్నారు.
చదవండి: సీబీఐ అధికారులమని చెప్పి రైడ్.. రూ.30 లక్షలు దోచుకెళ్లిన గ్యాంగ్..

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)