Breaking News

దారుణం.. నాలుగు రోజుల పసికందును తొక్కిన కానిస్టేబుల్..!

Published on Thu, 03/23/2023 - 08:55

రాంచీ: జార్ఖండ్ గిరిడీ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. నాలుగు రోజుల పసికందును పోలీస్ కానిస్టేబుల్‌ తొక్కాడని ఓ కుటుంబం ఆరోపించింది. దీంతో నవజాత శిశువు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. చిన్నారి తాత భూషణ్ పాండే  ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేపట్టాలని జిల్లా ఎస్పీని సీఎం హేమంత్ సోరెన్ ఆదేశించారు.

అయితే భూషణ్ పాండే ఓ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. చాలా రోజులుగా పోలీసుల నుంచి తప్పించుకుని తిరిగుతున్నాడు. ఈక్రమంలోనే అతడ్ని అరెస్టు చేసేందుకు పోలీసులు అతని ఇంటికి వెళ్లారు. ఉదయం 3:20 గంటల సమయంలో లోనికి ప్రవేశించారు. వీరిని చూసి భూషణ్ పాండేతో పాటు ఇతర కుటుంబసభ్యులు పారిపోయారు.

కానీ భూషణ్ కోసం వెతికే క్రమంలో ఓ గదిలో నిద్రిస్తున్న నాలుగు రోజుల పసికందును పోలీస్ కానిస్టేబుల్‌ పారపాటున తొక్కాడని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు వెళ్లిపోయాక లోపలికి వెళ్లి చూస్తే బిడ్డ చనిపోయి ఉందని పేర్కొన్నారు.

మరోవైపు పోలీసులు మాత్రం ఈ ఆరోపణలను కొట్టిపారేశారు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకే భూషణ్  లేనిపోని ఆరోపణలు చేస్తున్నాడని పేరొన్నారు. పోస్టుమార్టం రిపోర్టు తర్వాత అసలు వాస్తవాలు తెలుస్తాయన్నారు. సీఎం ఆదేశాల మేరకు దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.
చదవండి: ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్..!

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)