Breaking News

‘ఇంటర్నేషనల్‌’ తెలివి తేటలు.. ఏఐ ఉపయోగించి విద్యార్థినుల ఫోటోలు..!

Published on Wed, 10/08/2025 - 21:37

రాయ్‌పూర్‌: మనోడు చదివేది చత్తీస్‌గఢ్‌లోని నయా రాయ్‌పూర్‌లో ఉన్న ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీలో.. మరి చేసేవి గలీజు పనులు. మనోడికి ఇంటర్నేషనల్‌ తెలివి తేటలు బాగా ఉన్నట్లు ఉన్నాయి. ఐటీ విద్యార్థిగా తన స్కిల్స్‌ డెవలప్‌చేసుకోవడం మానేసి.. అమ్మాయిల ఫోటోలను ఏఐ టెక్నాలజీ జోడించి న్యూడ్‌గా మార్చేస్తున్నాడు. ఇలా సుమారు 36 మంది విద్యార్థినుల ఫోటోలను మార్ఫింగ్‌ చేసి వెయ్యిపైగా ఏఐ చిత్రాలను రూపొందించాడు. ఈ విషయం బయటకి రావడంతో సదరు విద్యార్థి సస్సెండ్‌ గురయ్యాడు. 

బిలాస్‌పూర్‌కు చెందిన థర్డ్‌ ఇయర్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన విద్యార్థి.. ఏఐ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన దగ్గర్నుంచీ ఇదే పనిలో ఉన్నాడు. ఇలా 36 మంది విద్యార్థినులకు చెందిన 1000కి పైగా ఏఐ న్యూడ్‌ చిత్రాలను సృష్టించాడు. 

 ఈ విషయం బయటకు రావడంతో సదరు విద్యార్థినులు అక్టోబర్‌ 6వ తేదీ  ఆ ఇన్‌స్టిట్యూట్‌లో ఫిర్యాదు చేశారు. దాంతో అతన్ని సస్సండ్‌ చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.  అదే సమయంలో ముగ్గురు సభ్యులతో కూడిన స్టాఫ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేశారు.  దీనిపై విచారణకు సిద్ధమైన  ఆ కమిటీ నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. 

అదే సమయంలో విద్యార్థినుల రాతపూర్వక ఫిర్యాదు కోసం వేచిచూస్తున్నామని, దానిని బట్టే తమ చర్యలు ఉంటాయని రాఖీ పోలీస్‌ స్టేషన్‌ ఇంచార్జ్‌ ఆశిష్‌ రాజ్‌పుత్‌ స్పష్టం చేశారు. బాధిత విద్యార్థినుల ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపడతామన్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)