Breaking News

బలవంతగా ఫోటోలు తీసి, బట్టలు తొలగించమని.. స్టేషన్‌లో ఎస్‌ఐ వికృత చేష్టలు

Published on Sun, 07/02/2023 - 13:22

గువాహటి: పోలీసులను రక్షక భటులని అంటారు. అయితే కొందరు మాత్రం ర‌క్షించాల్సింది పక్కన పట్టి భ‌క్షిస్తున్నారు. ఓ కేసు విషయమై స్టేషన్‌లోకి తీసుకువచ్చిన బాలిక‌పై క‌న్నేశాడు ఓ అధికారి. ఏకంగా పోలీస్‌స్టేష‌న్‌లోనే లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డ్డాడు. చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోలీసులు పోక్సో కేసు న‌మోదు చేశారు. విధుల నుంచి స‌స్పెండ్ చేశారు. ఈ దారుణ ఘ‌ట‌న అస్సాంలోని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ చోటుచేసుకుంది.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. జూన్ 21న బాల్య వివాహాల కేసులో మైనర్ బాలికను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. బాలిక తన ప్రియుడితో కలిసి పారిపోయిందని ఫిర్యాదు రావడంతో, పోలీసులు పట్టుకుని ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జి అధికారి.. స్టేషన్‌లో బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు ఆమె అభ్యంతరకరమైన ఫోటోలు తీశాడు. దీంతో ఆ బాలిక.. ‘స్టేషన్‌లో ఆ అధికారి నన్ను బెదిరించాడు, బ‌ట్ట‌లు తొల‌గించ‌మ‌ని బెదిరించాడు. ఎస్‌ఐ నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. బలవంతంగా నా ఫోటోలు తీశాడు. ’ అని ఫిర్యాదు చేసింది. ఈ దారుణమైన ఘటన వెలుగులోకి రావడంతో అస్సాం డీజీపీ ఈ కేసుపై స్పందించారు.

అస్సాం డీజీపీ జీపీ సింగ్ కేసు వివ‌రాల‌ను శుక్ర‌వారం మీడియాకు వెల్ల‌డించారు. అస్సాంలోని న‌ల్బ‌రీ జిల్లాలోని ఓ పోలీస్‌స్టేష‌న్‌లో జూన్ 21న 17 ఏళ్ల బాలిక ఫిర్యాదు ఇవ్వ‌డానికి రాగా, సబ్ ఇన్‌స్పెక్ట‌ర్ బిమ‌న్ రాయ్ లైంగిక‌ వేధింపుల‌కు గురి చేశాడు. ఈ ఘటనపై విచారణ జరిపి ఇన్‌స్పెక్టర్‌ను సస్పెండ్ చేసినట్టు డీజీపీ తెలిపారు. ప్రస్తుతం నిందితుడు రాయ్ ప‌రారీలో ఉన్నాడ‌ని పేర్కొన్నారు. అతని ఆచూకీ గురించి నల్బారి జిల్లా పోలీసు సూపరింటెండెంట్‌కు ఎవరైనా సమాచారం అందిస్తే తగిన రివార్డ్ ఉంటుంది" అని రాయ్ ఫోటోతో ట్వీట్ చేశారు.

ఇదిలా ఉండగా.. మైనర్‌లను స్టేట్ హోమ్‌లో కాకుండా పోలీస్ స్టేషన్‌లో ఉంచడం పోలీసుల తప్పిదమేనని నల్బరీ జిల్లా ఎస్పీ అంగీకరించారు. "మైనర్‌ల విషయంలో, కొన్ని సూచనలు ఇప్పటికే అమలులో ఉన్నాయి, వాటిని అందరు పోలీసు సిబ్బంది పాటించాలి. మైనర్‌లను పోలీస్ స్టేషన్‌లో ఉంచకూడదు" అని, వారిపై కఠినమైన చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం స్టేట్‌హోమ్‌లో ఉంచిన బాలిక వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారని ఆయన చెప్పారు.

చదవండి: వివాహేతర సంబంధం... ప్రసన్న తలపై రాడ్డుతో విచక్షణారహితంగా 8 సార్లు బాది...

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)