Breaking News

పటాన్‌ చెరులో పరువు హత్య!

Published on Wed, 12/10/2025 - 16:58

సాక్షి,హైదరాబాద్‌: ప్రేమ పేరుతో మరో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేస్తామంటూ ఇంటికి పిలిచి ఓ యువకుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన పటాన్‌ చెరులో వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.

పటాన్‌ చెరుకు చెందిన ఇంజినీరింగ్‌ విద్యార్థి శ్రవణ్‌ అదే ప్రాంత బీబీఏ విద్యార్థిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య స్కూల్‌ వయస్సు నుంచే ప్రేమాయణం కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రేమ వ్యవహారం సదరు యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వారి మధ్య ప్రేమ వ్యవహారం బయటపడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.

పెళ్లి చేస్తామని నమ్మించి  
పోలీసుల ప్రకారం..యువతి కుటుంబ సభ్యులు ముందుగా పక్కా ప్లాన్‌ వేసుకున్నారు. ‘మీ ఇద్దరికి పెళ్లి చేస్తాం. ఇదే విషయం గురించి మాట్లాడుకుంది. ఇంటికి రావాలని శ్రవణ్‌ని తమ ఇంటికి పిలిపించారు. పెళ్లి మాట నమ్మిన శ్రవణ్‌ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న వెంటనే యువతి కుటుంబ సభ్యులు శ్రవణ్‌పై దాడి దిగారు. క్రికెట్‌ బ్యాట్లతో విచక్షణారహితంగా కొట్టడంతో శ్రవణ్‌ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలపాలై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.

పోలీసుల దర్యాప్తు ప్రారంభం
సమాచారం అందుకున్న పటాన్‌ చెరు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శ్రవణ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరువు హత్య కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.

స్థానికులు ఆగ్రహం 
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో యువకుడి ప్రాణం తీసిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)