Breaking News

Hyderabad: ‘డబ్బులు ఇవ్వకపోతే  ఫొటోలు వైరల్‌ చేస్తా’.. యువతి బెదిరింపులు.

Published on Fri, 11/17/2023 - 10:56

సాక్షి, హైదరాబాద్‌: అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్‌ చేస్తానంటూ ఓ యువకుడిని ఒక యువతి వేధింపులకు గురి చేస్తున్న సంఘటన మధురానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన కిరణ్‌కుమార్‌ కృష్ణానగర్‌లో ఉంటున్నాడు. ఏడాది క్రితం అతను రూం షేరింగ్‌ కోసం ఓఎల్‌ఎక్స్‌లో ప్రకటన ఇచ్చాడు.

ఓ యువతి స్పందించి తాను షేర్‌ చేసుకుంటానని చెబుతూ కూకట్‌పల్లిలో రూం తీసుకోవాలని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి గదిలో ఉంటున్నారు. అయితే తాను వేశ్యనని ఆమె చెప్పడంతో, తన ప్రవర్తన నచ్చక  కిరణ్‌ ఆమెను బయటికి వెళ్లాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో పాటు తాము సన్నిహితంగా ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తానంటూ బెదిరించింది.

అంతేగాక తనపై లైంగిక దాడిచేశాడని సైబరాబాద్‌ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. తర్వాత అతడి నుంచి ఆమెకు రూ.4.70 లక్షలు పరిహారంగా చెల్లించాడు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్‌ చేయడంతో కిరణ్‌కుమార్‌ సైబర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. ఈ నెల 13న రాత్రి ఆమె కిరణ్‌ను సారథి స్టూడియో వద్దకు రప్పించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అతడిపై దాడి చేసింది. గురువారం అతను మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

 
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)