Breaking News

మరదలిపై వదిన దుర్మార్గం

Published on Fri, 11/15/2024 - 07:22

అన్న భార్య తల్లితో సమానం అంటారు. అలాంటిది ఆ వదిన తప్పుడు దోవలో వెళ్తుంటే ఆ యువతి ఆపాలని చూసింది. కానీ, అదే ఆ యువతి పాలిట మృత్యువైంది. బేగంపేటలో బలవన్మరానికి పాల్పడిన యువతి సూసైడ్‌ కేసులో.. వదినతో పాటు ఆమె ప్రియుడ్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

రసూల్‌పురా ఇందిరమ్మనగర్‌కు చెందిన విఠల్‌ కూతురు స్రవంతి(19) ఈ నెల 11వ తేదీన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పొరుగున ఉండే ఓ యువకుడి వేధింపులతోనే కూతురు ఆత్మహత్య చేసుకుందని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు స్రవంతి సెల్‌ఫోన్‌లోని మెసేజ్‌ల ఆధారంగా.. యూసుఫ్‌గూడ రహమత్‌నగర్‌లో ఉంటున్న నవీన్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు.

అయితే.. స్రవంతి వదిన శైలజకు నవీన్‌కుమార్‌తో పెళ్లికి ముందే సంబంధం ఉన్నట్లు గుర్తించారు. అతను ఇటీవల మళ్లీ శైలజను కలవడం ప్రారంభించాడు. ఈ విషయాన్ని స్రవంతి గుర్తించింది. అన్నను చెప్పనని, ఇప్పటికైనా తీరు మార్చుకోమని స్రవంతి, శైలజతో మంచిగా చెప్పింది. అయితే.. శైలజ తన తీరు మార్చుకోలేదు. ఈ విషయం ఎక్కడ బయటపడుతుందోనని భావించింది. ఈ క్రమంలో.. స్రవంతికి ఇంటి పక్కనే ఉండే ఓ యువకుడితో సంబంధం ఉందంటూ ప్రచారం చేస్తూ వేధింపులకు దిగింది. అతను తనకు సోదరుడి వంటివాడని చెప్పినా వినిపించుకోలేదు.

పైగా తనతో సంబంధం ఉన్న నవీన్‌కుమార్‌ను రంగంలోకి దించి అతనితో స్రవంతి ఫోన్‌కు సందేశాలు పంపిస్తుండేది. వదిన, నవీన్‌కుమార్‌లు పెట్టే వేధింపులు తట్టుకోలేక స్రవంతి ఆత్మహత్యకు పాల్పడింది. అయితే కోడలే తన కూతురు ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసుల విచారణలో బయటపడటంతో స్రవంతి తల్లిదండ్రులు షాక్‌కి గురయ్యారు.  శైలజతో పాటు నవీన్‌కుమార్‌ను గురువారం పోలీసులు అరెస్టు చేశారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)