Breaking News

భార్యాభర్తల డ్రగ్స్‌ దందా!

Published on Sun, 12/01/2024 - 11:49

సాక్షి, సిటీబ్యూరో: ఈశాన్య రాష్ట్రమైన అసోం నుంచి మాదకద్రవ్యం ఏంఫెటమైన్‌తో నగరానికి వచ్చి, విక్రయానికి ప్రయత్నించినా భార్యా భర్తల్ని వెస్ట్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ పోలీసులు పట్టుకున్నారు. వీరి నుంచి రూ.20 లక్షలు విలువైన 254 గ్రాముల డ్రగ్, ద్విచక్ర వాహనం, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ వైవీఎస్‌ సుదీంద్ర శనివారం వెల్లడించారు. అసోంలోని లాల్‌పానీ గ్రామానికి చెందిన ఆతిఫ్‌ అస్లం ఖాన్‌ గతంలో నగరానికి వలసవచ్చి నిమ్స్‌ హాస్పిటల్‌లో సెక్యూరిటీ గార్డుగా పని చేశాడు. దాదాపు ఐదారేళ్లు ఇక్కడ ఉండటంతో ఇతడిలా వచి్చ, సిటీలో నివసిస్తున్న పలువురు అసోం వారితో పరిచయం ఏర్పడింది. 

అసోంలోని మొరాంగా గ్రామానికి చెందిన సుభానీ బేగంను వివాహం చేసుకున్న అస్లం ఖాన్‌ స్వస్థలానికి వలసవెళ్లాడు. తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం మార్గాలు అన్వేషించాడు. అసోంలో తయారయ్యే మాదకద్రవ్యం ఏంఫెటమైన్‌ను ఆ రాష్ట్రానికి చెందిన అనేక మంది వినియోగిస్తూ ఉంటారు. దీంతో ఆ డ్రగ్‌ దందా చేయాలని నిర్ణయించుకున్నాడు. డ్రగ్‌పెడ్లర్‌ ప్రణోయ్‌ దాస్‌కు రూ.2 లక్షలు చెల్లించిన అస్లం ఖాన్‌ 300 గ్రాముల ఏంఫెటమైన్‌ ఖరీదు చేశాడు. భార్య సుభానీ బేగంతో కలిసి మాదకద్రవ్యం తీసుకుని అస్లం ఖాన్‌ గత నెల్లో రైలు మార్గంలో నగరానికి చేరుకున్నాడు.

 బేగంపేటలోని ప్రకాష్‌నగర్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌లో ఓ బైక్‌ ఖరీదు చేశాడు. దీనిపై సంచరిస్తూ నగరంలో ఉన్న అసోం వాసులకు ఏంఫెటమైన్‌ విక్రయించడం మొదలెట్టాడు. డిమాండ్‌ను బట్టి రేటు నిర్ధారిస్తూ తమ వద్ద ఉన్న 300 గ్రాములు అమ్మడం ద్వారా రూ.25 లక్షలు సంపాదించాలని, ఆ మొత్తంతో స్వస్థలానికి తిరిగి వెళ్లిపోవాలని పథకం వేశారు. ఇప్పటి వరకు 11 మంది అసోం వాసులకు 46 గ్రాములు విక్రయించారు. వీరి దందాపై సమాచారం అందుకున్న వెస్ట్‌జోన్‌ టాస్‌్కఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇ.జంగయ్య నేతృత్వంలో ఎస్సై జి.నవీన్‌ తమ బృందంతో వలపన్నారు. శనివారం ఇద్దరితో పాటు 11 మంది వినియోగదారులను పట్టుకున్నారు. తదుపరి చర్యల నిమిత్తం వీరిని బేగంపేట పోలీసులకు అప్పగించారు.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)