Breaking News

అమ్మో ఫాస్ట్‌ఫుడ్‌! హైదరాబాద్‌లో కల్తీ పంది నూనె కలకలం.. కొవ్వు కొని..

Published on Thu, 06/29/2023 - 14:58

సాక్షి, హైదరాబాద్‌:  సిటీ లైఫ్‌లో ప్రజల దినచర్య బిజీబిజీగా గడుపుతుంటారు. కాలుష్య కోరల్లో ప్రయాణం, ఫాస్ట్‌ ఫాస్ట్‌గా పరిగెత్తుతూ ఫాస్ట్‌ పుడ్‌ సెంటర్‌లో ఆహారం తింటూ.. అలా బతుకు బండిని నడిపిస్తుంటారు. అయితే నగర కాలుష్యాన్ని మనం నియంత్రించడం అంత సులువు కాదు కాబట్టి, కనీసం మనం తినే ఆహారం విషయంలో నాణ్యత ఉండేలా చూసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. ఇదిలా ఉండగా మరోవైపు ఆహార పదార్థాలే టార్గెట్‌గా కొన్ని ముఠాలు వ్యాపారాలు మొదలుపెట్టాయి.

ఇటీవల నగరంలో కల్తీ అల్లంవెల్లుల్లీ పేస్ట్, ఐస్ క్రీమ్స్, సాస్, చాక్లెట్స్ బాగోతం బయటపడింది. అయితే, తాజాగా పంది కొవ్వుతో కల్తీ నూనెలు తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు నేరెడ్‌మెట్‌ పోలీసులు. వివరాల్లోకి వెళితే.. నగరంలోని నేరేడ్‌మెట్‌ పరిధిలోని ఆర్కేపురంలో ఓ వ్యక్తి తాను నివసిస్తున్న ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా పంది కొవ్వుతో వంట నూనెలు తయారు చేస్తున్నాడు.

తొలుత పంది మాంసం విక్రయించే వారి నుంచి కొవ్వు తెచ్చుకుని.. వాటిని వేడి చేసి పలు రకాల కెమికల్స్ కలిపితే అచ్చం వంట నూనెలాగా కనిపించే ఆయిల్స్‌ను తయారు చేయడం.. వాటిని రోడ్డు పక్కన ఉండే ఫాస్ట్‌పుడ్‌ సెంట‍ర్లకు తక్కువ ధరకు అమ్ముతున్నాడు. ఈ దందా గతకొంత కాలంగా నిర్వహిస్తున్నాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు అతని ఇంటిపై ఆకస్మిక సోదాలు నిర్వహించగా.. కల్తీ గుట్టు మొత్తం బట్టబయలైంది. దీంతో నిందితుడిని నేరెడ్‌మెట్‌ పోలీసులు అరెస్టు చేశారు.
చదవండి: IT Scam Hyderabad:హైదరాబాద్‌లో మరో భారీ ఐటీ కుంభకోణం

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)