Breaking News

‘చిన్న చిన్న తప్పులు చేశాను’..అంటూ సెల్ఫీ వీడియో తీసుకొని

Published on Wed, 09/21/2022 - 15:09

సాక్షి, హైదరాబాద్‌: జీవితం మీద విరక్తి చెంది ఓ బీటెక్‌ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న ఘటన పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నిర్మల్‌ జిల్లా కుంటాల గ్రామానికి చెందిన నారాయణరావు కుమారుడు హర్షిత్‌(20) మల్లారెడ్డి కళాశాలలో బీటెక్‌ థర్డ్‌ ఇయర్‌ చదువుతున్నాడు. మైసమ్మగూడలోని శ్రీకాంత్‌రెడ్డి హాస్టల్‌లో ఉంటూ ప్రతి రోజు కాలేజీకి వెళ్లి వస్తుండేవాడు. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు హాస్టల్‌ గదికి చేరుకున్న హర్షిత్‌ సాయంత్రం 4 గంటల సమయంలో తోటి స్నేహితులు వచ్చే సరికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు.

వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న వారు ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీయగా.. ‘చిన్న చిన్న తప్పులు చేశాను.. స్నేహితుల వద్ద అప్పులు కూడా తీసుకున్నాను.. చదువులో సైతం పూర్‌గా ఉన్నాను.. జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్న’ అంటూ సెల్ఫీ వీడియో ఉన్నట్లు తేలింది. దీంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వగా తండ్రి నారాయణరావు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆత్మహత్యకు గల కారణాలు ఫోన్‌ ఓపెన్‌ అయితే తెలుస్తుందన్న తండ్రి అనుమానం మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: నెహ్రూ జూపార్కులోనే ఓ చీతా ఉంది తెలుసా!

Videos

అనంతపురం జిల్లాలో భారీ వర్షం

నందిగం సురేష్ అరెస్ట్

లిక్కర్ కేసు వెనక కుట్ర.. అడ్డంగా దొరికిన చంద్రబాబు

ఫ్యామిలీతో తిరుమలలో ఎంపీ గురుమూర్తి

పాతబస్తీ అగ్నిప్రమాద ఘటనపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

ఎంటర్ ది డ్రాగన్.. కరోనా వచ్చేసింది

స్పిరిట్ లో కల్కి జోడి..

ఆ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్న రవితేజ..!

కోపముంటే నాపై తీర్చుకో.. ప్రజల్ని ఎందుకు హింసిస్తావ్.. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై ఫైర్

కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు

Photos

+5

తెలంగాణ సచివాలయంలో అందగత్తెలు

+5

అనసూయ నూతన గృహప్రవేశం.. పూజా కార్యక్రమం (ఫోటోలు)

+5

పాతబస్తీలో పెను విషాదం.. అగ్నిప్రమాద దృశ్యాలు

+5

చెల్లి పెళ్లిలో నటి హరితేజ (ఫోటోలు)

+5

ఎంగేజ్ మెంట్ పార్టీలో 'కొత్త బంగారు లోకం' హీరోయిన్ (ఫొటోలు)

+5

బిగ్ బాస్ అశ్విని బర్త్ డే పార్టీలో పల్లవి ప్రశాంత్ (ఫొటోలు)

+5

చిరుకు జోడీగా నయన్.. ఫస్ట్ టైమ్ ఇలా (ఫొటోలు)

+5

Miss World 2025 : రామోజీఫిల్మ్‌ సిటీలో అందాల కాంతలు..! (ఫొటోలు)

+5

తల్లి కోరిక.. టక్కున తీర్చేసిన విజయ్ దేవరకొండ (ఫొటోలు)

+5

కేన్స్ లో సోనమ్ కపూర్.. అప్పట్లో ఇలా (ఫొటోలు)