Breaking News

ఫిలింనగర్‌లో కారు బీభత్సం.. ర్యాష్‌ డ్రైవింగ్‌తో రెచ్చిపోయిన మహిళ

Published on Mon, 07/31/2023 - 15:01

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఫిలింనగర్‌లో ఎలక్ట్రికల్ బెంజ్ కారు బీభత్సం సృష్టించింది. ఎలక్ట్రికల్ బెంజ్ కారులో ఓ మహిళ ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ.. ఓవర్ స్పీడ్‌లో చెట్టును ఢీకొట్టింది. తర్వాత కారు కంట్రోల్‌ అవ్వకపోవడంతో ఎలక్ట్రికల్ పోల్, గోడను ఢీ కొట్టింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవడంతో మహిళ ప్రాణాలతో బయటపడింది. కారు రెండు టైర్లు విడిపోయి.. కొంత దూరంలో ఎగిరి పడ్డాయి.

అయితే కారును అక్కడే వదిలేసిన యువతి.. తన హై హీల్స్ భుజాన వేసుకుని సాఫీగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. కాగా ప్రమాద స్థలంలో గుడిసెలో ఓ వాచ్ మెన్ కుటుంబం నివాసముంటోంది.  గుడిసెకు అడుగుదూరంలో కారు ఆగడంతో సదరు కుటుంబం ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది.

ఈ ఘటనలో కరెంట్‌ స్తంభం, గోడ కూలిపోయాయి. అంతా మట్టి,రాళ్లు గుట్టలుగా పేరుకుపోవడంతో గోడకు తగిలి కారు అయిపోయింది. లేదంటే నేరుగా ఎదురుగా గుడిసెలోకి దూసుకెళ్లేదని స్థానికులు అంటున్నారు. కారు అదే స్పీడ్‌లో వెళ్ళి ఉంటే ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని చెబుతున్నారు.

దీనిపై సమాచారం అందుకున్న ఫిలింనగర్‌ పోలీసులు కారును పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. నెంబర్ ప్లేట్ ఆధారంగా మహిళను గుర్తించే పనిలో పడ్డారు.  ప్రమాద సమయంలో కారులో ఉన్న యువతి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
చదవండి: కనురెప్ప కంటే తక్కువ బరువు.. వర్షానికి వాసన ఉంటుందా?

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)