Breaking News

భార్యతో వీడియోకాల్‌ మాట్లాడుతూ భర్త ఆత్మహత్య

Published on Tue, 09/30/2025 - 14:53

తిరువొత్తియూరు: కోయంబత్తూరు పీలమేడు సమీపంలోని వి.కె.రోడ్, చేరన్‌ నగర్, 4వ బస్టాప్‌ ప్రాంతానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు జయపాల్‌(47). ఇతని భార్య వాలెంటినా(40). వీరికి ఒక కుమారుడు ఉన్నారు. ఈ నేపథ్యంలో వాలెంటినా తన కొడుకుతో కలిసి మధురైలోని బంధువుల ఇంటికి వెళ్లింది. సంఘటన జరిగిన రాత్రి జయపాల్‌ తన భార్యకు సెల్‌ఫోన్‌లో వీడియో కాల్‌ చేసి మాట్లాడాడు. అప్పుడు, అతను తన భార్యతో తాను ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు చెప్పాడు. అంతేకాకుండా వీడియో కాల్‌లో భార్యతో మాట్లాడుతూనే ఇంట్లో ఉన్న తన భార్య చుడీదార్‌ ప్యాంటు తీసుకుని ఫ్యాన్‌కు తగిలించి ఉరి వేసుకున్నాడు. 

వీడియో కాల్‌లో ఇది చూసి దిగ్భ్రాంతి చెందిన అతని భార్య, వెంటనే కోయంబత్తూరులోని తమ ఇంటి సమీపంలో నివశిస్తున్న బంధువులకు ఫోన్‌ చేసి, తమ ఇంటికి వెళ్లి చూడాలని కోరింది. వారు అక్కడికి వెళ్లి జయపాల్‌ను రక్షించడానికి ప్రయత్నించారు. అతను ఉన్న గది తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లి ఉరి వేసుకున్న అతన్ని కిందకు దించారు. ఆ తర్వాత అంబులెన్స్‌లో సింగనల్లూరు ఈఎస్‌ఐ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన డాక్టర్లు అతను ఆసుపత్రికి వచ్చే మార్గంలోనే మరణించినట్లు తెలిపారు. భర్త ఉరి వేసుకుని వేలాడుతుండడం చూసిన వాలెంటీనా వెంటనే కోయంబత్తూరుకు  తిరిగి వచ్చింది. ఆమె కుమారుడితో కలసి మరణించిన జయపాల్‌ మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. దీనిపై వాలెంటినా కోయంబత్తూరు పీళమేడు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)