Breaking News

స్కూటీలో వెళ్తున్న భార్యను సుమోతో ఢీకొట్టించి...

Published on Mon, 07/17/2023 - 09:21

యశవంతపుర: తల్లిదండ్రులనుంచి తనను వేరు చేసేందనే కసితో భార్యను అంతమొందించేందుకు   పన్నిన పథకం బెడిసికొట్టి భర్త కటకటాల  పాలయ్యాడు.    ఈ ఘటనకు సంబంధించి అరవింద, ఉదయకుమార్‌ అనే నిందితులను అరెస్ట్‌ చేశారు. బెంగళూరుకు చెందిన చైతన్యను అరవింద్‌ ఏడాదన్నర క్రితం వివాహం చేసుకున్నాడు. ఆమె ఆరు నెలల గర్భిణి. వివాహం అనంతరం చైతన్య వేరు కాపురం పెట్టించింది. తల్లిదండ్రులనుంచి దూరంగా ఉండటంతో అరవింద్‌ మనోవేదనకు గురయ్యాడు. దీంతో  చైతన్యనుంచి విడాకులు తీసుకోవాలని నిర్ణయించగా ఆమె అంగీకరించలేదు.

దీంతో చైతన్యను హత్య చేయాలని ప్లాన్‌ వేసి పాత టాటాసుమోను కోనుగోలు చేసి ఉదయకుమార్‌ అనే వ్యక్తిని డ్రైవర్‌గా పెట్టుకున్నాడు. చైతన్యను యాక్సిడెంట్‌ ద్వారా  హత్య చేయాలని సుఫారీ ఇచ్చాడు. సీసీ కెమెరాలులేని  స్థలాన్ని గుర్తించి అక్కడ యాక్సిడెంట్‌ చేయాలని ఉదయకుమార్‌కు సూచించాడు. వారం రోజుల క్రితం భరతనాట్యం ముగించుకొని బాగలూరు కెఐడీబి లేఔట్‌ సమీపంలో స్కూటీతో వెళ్తున్న చైతన్యను సుమోతో ఢీకొన్నారు.

స్వల్పంగా గాయపడిన ఆమె బాగలూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారించిన పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీ కేమరాలను పరిశీలించగా అనవాళ్లు దొరకలేదు. అదే మార్గంలో పాత టాటా సుమో తిరిగిన అనవాళ్లను గుర్తించి ఆ వాహనం ఎవరిదనే వివరాలు సేకరించి  ఉదయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుట్ర వెలుగు చూసింది. దీంతో ఉదయ్‌కుమార్, అరవిందను అరెస్ట్‌ చేశారు.    

Videos

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)