Breaking News

భారీగా నగదు, బంగారం పట్టివేత

Published on Fri, 05/31/2024 - 05:26

కావలి/టంగుటూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం జిల్లా పరిధిలో పోలీసుల తనిఖీల్లో భారీగా నగదు, బంగార దొరికాయి. కావలి వద్ద చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ఉన్న గౌరవరం టోల్‌ప్లాజా సమీపంలో కావలి రూరల్‌ సీఐ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీగా నగదు, బంగారాన్ని పట్టుకున్నారు. వీటిని తరలిస్తూ పట్టు­బడిన వారంతా తెలంగాణలోని మిర్యాల­గూడకు చెందిన వారే కావడం గమనార్హం. 

ఈ వివరాలను కావలి డీఎస్పీ వెంకటరమణ మీడి­యాకు వెల్లడించారు. చెన్నై వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సును తనిఖీ చేయగా.. మిర్యాలగూడకు చెందిన మహిళలు తేజ, సుమతి వద్ద రూ.72.50 లక్షల నగదు బయటపడిందని చెప్పారు. వీటికి సంబంధించి ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అలాగే చెన్నై వెళ్తున్న మరో ట్రావెల్స్‌ బస్సును తనిఖీ చేయగా మిర్యాలగూడకే చెందిన శివమ్మ, యాదమ్మ వద్ద రూ.60 లక్షలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. 

మరో బస్సులో వెళ్తున్న మిర్యాలగూడకే చెందిన పర్వీన్‌ వద్ద రూ.29 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెన్నై నుంచి మిర్యాలగూడ వెళ్తున్న కారును తనిఖీ చేయగా.. మోహన్, ప్రభాకర్‌ అనే వ్యక్తుల వద్ద కిలోన్నర బంగారం బయటపడిందని చెప్పారు. ఈ బంగారానికి సంబంధించి రసీదులు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

నగదు, మొత్తం బంగారం విలువ కలిపి రూ.2.62 కోట్లు ఉంటాయని వెల్లడించారు. అలాగే చెన్నై నుంచి మిర్యాలగూడకు కారులో వెళ్తున్న మద్దిశెట్టి మల్లేశ్, చంద్రకళ వద్ద 1.238 కేజీల బంగారు బిస్కెట్లను ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద సింగరాయకొండ పోలీసులు పట్టుకున్నారు. 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)