Breaking News

నెల్లూరు జిల్లాలో పరువు హత్య

Published on Sat, 09/21/2024 - 03:49

కొడవలూరు: కుమార్తె తమ మాట కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని కుటుంబ పరువుకు భంగం కలిగించిందన్న కోపంతో ఆమె తల్లిదండ్రులు, సోదరి, సోదరుడు కలిసి హత్యచేశారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలోనే మృతదేహాన్ని పూడ్చిపెట్టి కంప వేశారు. 25 రోజుల అనంతరం స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం పద్మనాభసత్రంలో జరిగింది.

కొడవలూరు సీఐ సురేంద్రబాబు, ఎస్సై సీహెచ్‌ కోటిరెడ్డి, గ్రామస్తులు శుక్రవారం తెలిపిన వివరాల ప్రకారం..  పద్మనాభసత్రం పల్లెపాళేనికి చెందిన తిరుమూరు వెంకటరమణయ్య, దేవసేనమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. పెద్ద కుమార్తె భువనేశ్వరికి పదేళ్ల క్రితమే వివాహమైంది. రెండో కుమార్తె శ్రావణి (24)కి ఆరేళ్ల క్రితం పెళ్లి చేశారు. కొద్దిరోజులకే ఆమె భర్తతో విభేదించి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. వారికి పద్మనాభసత్రం మెయిన్‌ రోడ్డు వెంబడి కూరగాయల దుకాణం ఉండగా వారికి సహాయంగా ఉంటోంది. 

ఈ క్రమంలోనే అల్లూరు మండలం నార్త్‌ఆములూరుకు చెందిన షేక్‌ రబ్బానీ బాషా అనే పెయింటర్‌తో ఆమెకు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. హత్యకు గురయ్యే పదిరోజుల ముందు శ్రావణి ఆ యువకుడితో వెళ్లిపోయి అతన్ని పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ నార్త్‌ఆములూరులోనే కాపురం పెట్టారు. వారంరోజుల తర్వాత ఈ విషయం శ్రావణి తల్లిదండ్రులకు తెలిసి ఇంటికి తీసుకొచ్చారు. తమ కులానికే చెందిన మరో వ్యక్తితో వివాహం చేస్తామని, వెళ్లొద్దని ఆమెపై ఒత్తిడి తేవడంతోపాటు దారుణంగా కొట్టారు. ఇది చుట్టుపక్కల వారు గమనించారు.

పూడ్చిపెట్టి.. పైన కంప వేసి..  
శ్రావణి మాట వినకపోవడంతో 25 రోజుల క్రితం ఓ రాత్రి ఆమె తల్లిదండ్రులతోపాటు సోదరి భువనేశ్వరి, సోదరుడు సాయి కలిసి ఆమెను తీవ్రంగా కొట్టి హత్యచేశారు. ఈ విష­యం బయటకు పొక్కకుండా ఇంటి పక్కనే ఉన్న వారి ఖాళీ స్థలంలో చెంచయ్య అనే వ్యక్తి సాయంతో గుంత తీయించి మృతదేహాన్ని పూడ్చిపెట్టి ఎవరికీ అనుమానం రాకుండా పైన కంప వేసేశారు. ఈ నేపథ్యంలో.. ఇరవై రోజులు గడిచినా శ్రావణి నుంచి ఫోన్‌ రాకపోవడంతో షేక్‌ రబ్బానీ బాషా గ్రామంలో విచారించాడు. 

తల్లిదండ్రులతో శ్రావణి లేదని గ్రామస్తు­లు తెలుపడంతో వారే హతమార్చి ఉంటారని అనుమానించాడు. గ్రామస్తుల­కూ సందేహం వచ్చి ఇంటి పరిసర ప్రాంతాలు పరిశీలించగా ఖాళీ స్థలంలో పాతి పెట్టిన ఆనవాళ్లు వారి అనుమానానికి బలం చేకూర్చాయి. దీంతో పోలీసులకు సమాచారం అందించారు. సీఐ సురేంద్రబాబు, ఎస్సై కోటిరెడ్డి శ్రావణి తల్లిదండ్రులను అదుపులోకి తీసుకుని విచారించారు. తామే శ్రావణిని హత్యచేసి పాతి పెట్టామని వారు అంగీకరించినట్లు సీఐ తెలిపారు.

దీంతో తహసీల్దార్‌ కె. స్ఫూర్తి మృతదేహాన్ని వెలికితీసి పంచనామా నిర్వహించారు. హత్యకు పాల్పడిన తల్లిదండ్రులు, సోదరి, సహకరించిన సోదరుడు, చెంచయ్యపై హత్యకేసు నమోదు చేసినట్లు సీఐ చెప్పారు. తల్లిదండ్రులను, చెంచయ్యను అదుపులోకి తీసు­కున్నామని,   భువనేశ్వరి, సాయి పరారీలో ఉన్నారని, వారిని పట్టుకుంటామని తెలిపారు.

Videos

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

Photos

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)