Breaking News

Hyderabad: హిట్‌ అండ్‌ రన్‌ కేసు నమోదు

Published on Tue, 05/21/2024 - 07:42

నల్లకుంట: మద్యం మత్తులో కారు నడిపి రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖకు చెందిన ఓ అధికారి వీరంగం సృష్టించిన ఘటన నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అడ్మిన్‌ ఎస్సై శ్రీనివాస్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బాగ్‌అంబర్‌పేట డీడీ కాలనీకి చెందిన యడవల్లి శ్రీనివాస్‌ సీతారమేష్(46)టీచర్‌గా పని చేస్తున్నాడు. 

ఈ నెల 18న రాత్రి అతను బైక్‌పై విద్యానగర్‌ లక్కీ కేఫ్‌ సమీపంలోని ఐరావత్‌ ఐ క్లినిక్‌ రోడ్డులో వెళుతున్నాడు. అదే సమయంలో వేగంగా దూసుకువచి్చన కారు ముందు వెళుతున్న బైక్‌ను ఢీకొట్టడంతో రమేష్‌ కిందపడ్డాడు. ఈ ఘటనపై బాధితుడు రమేష్‌ ఈ నెల 19న నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై రమాదేవి దర్యాప్తు చేపట్టారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేయలేదని సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఎస్సై పేర్కొన్నారు. ఫిర్యాదు అందిన వెంటనే కేసు నమోదు చేశామన్నారు. స్థానికులు కారును అడ్డుకుని కారు నడుపుతున్న వ్యక్తిని నిలదీస్తూ సెల్‌ ఫోన్‌లో వీడియో తీశారు. ప్రమాద  సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం.కారు కుడివైపు ముందు డోర్‌ పక్కన బీరు బాటిల్‌ ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్‌గా మారింది. కాగా ఘటన జరిగిన సమయంలో కారు నడుపుతున్న వ్యక్తి పక్కన ఓ చిన్నారి కూడా ఉండటం గమనార్హం.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)