Breaking News

కొట్టేసిన బంగారం విలువ మినహా మిగతా డబ్బు ఇచ్చేయండి!

Published on Tue, 08/27/2024 - 05:23

సాక్షి, అమరావతి: పదవీ విరమణకు ముందు ఖాతాదారుని లాకరు నుంచి బంగారం చోరీ చేసినట్లు ఆరోపణలు ఉన్న యూనియన్‌ బ్యాంకు ఉద్యోగికి చోరీకి గురైన బంగారం విలువ మినహా మిగతా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఇవ్వాల్సిందేనని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. ఆయనపై శాఖాపరమైన విచారణ మూడు నెలల్లో ముగించాలని, ఆలోగా ముగియకపోతే నిలిపివేసిన సొమ్మునూ ఇచ్చేయాలని ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది.

పల్నాడు జిల్లా నర్సరావుపేట యూనియన్‌ బ్యాంకులో 2019 మార్చి 5న ఓ ఖాతాదారుడి లాకర్‌ నుంచి బంగారం సంచి మాయమైంది. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించిన బ్యాంకు అధికారులు ఆ బంగారాన్ని ఆ శాఖ ఉద్యోగి నాయక్‌ చోరీ చేశారని నర్సరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు నాయక్‌పై కేసు నమోదు చేశారు. అదే నెల 31న నాయక్‌ పదవీ విరమణ చేశారు. ఆ ఏడాది డిసెంబరు 3న బ్యాంకు అధికారులు నాయక్‌పై శాఖాపరమైన విచారణ ప్రారంభించారు.

పదవీ విరమణ అనంతరం నాయక్‌కు రావాలి్సన రిటైర్మెంట్‌ ప్రయోజనాల డబ్బు ఆయన ఖాతాలో జమ చేసినప్పటికీ, క్రిమినల్‌ కేసు, శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉండటంతో వాటిని బ్యాంకు అధికారులు జప్తు చేశారు. ప్రొవిజినల్‌ పెన్షన్‌ మినహా మిగిలిన ప్రయోజనాలని్నంటినీ నిలిపేశారు. ఖాతాల జప్తుపై నాయక్‌ 2022లో హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బంగారం చోరీతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తప్పుడు సమాచారం ఆధారంగా కేసు పెట్టారని తెలిపారు. సింగిల్‌ జడ్జి బ్యాంకు వాదనను కూడా విన్నారు. శాఖాపరమైన విచారణ పెండింగ్‌లో ఉన్న నెపంతో పదవీ విరమణ ప్రయోజనాలను నిలిపేయడాన్ని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఆయనకు రావాలి్సన రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అన్నింటినీ విడుదల చేయాలని బ్యాంకు యజమాన్యాన్ని ఆదేశించారు.

సింగిల్‌ జడ్జి ఆదేశాలపై యూనియన్‌ బ్యాంకు హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేసింది. ఈ అప్పీల్‌పై సీజే జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం విచారణ జరిపింది. యూనియన్‌ బ్యాంకు తరఫు సీనియర్‌ న్యాయవాది డాక్టర్‌ కె.లక్ష్మీనరసింహ వాదనలు వినిపిస్తూ.. శాఖాపరమైన విచారణ పూర్తయ్యేంత వరకు ఆ వ్యక్తి పదవీ విరమణ ప్రయోజనాలను ఆపే అధికారం తమకుందన్నారు.

ఆ ఉద్యోగి బంగారం కాజేయడం వల్ల బ్యాంకుకు ఎంత నష్టం వాటిల్లిందని ధర్మాసనం ప్రశ్నించగా.. రూ.4.42 లక్షలు నష్టం వాటిల్లిందని లక్ష్మీనరసింహ తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. నాయక్‌ రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను నిలిపేయడాన్ని, బ్యాంకు ఖాతాల జప్తును తప్పుపట్టింది. చోరీకి గురైన బంగారం విలువ రూ.4.42 లక్షలు మినహా మిగతా సొమ్మంతా విడుదల చేయాలని, బ్యాంకు ఖాతాల నిర్వహణకు నాయక్‌కు అనుమతినివ్వాలని బ్యాంకును ఆదేశించింది. శాఖాపరమైన విచారణకు సహకరించాలని నాయక్‌ను ఆదేశించింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)