Breaking News

మెదక్‌: వెళ్లిపోయావా అక్షర!

Published on Tue, 07/25/2023 - 13:58

మెదక్‌ :  జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. తీవ్ర వర్షాలు.. గుంతలు, బురదతో అధ్వానంగా మారిన రోడ్డు ఓ పదేళ్ల బాలిక జీవితాన్ని బలిగొంది. అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే క్రమంలో రోడ్డు కారణంగా ఆలస్యమై ఆ చిన్నారి కన్నుమూసింది.  మెదక్‌ జిల్లా వెల్దుర్తి మండలం మహ్మద్‌నగర్‌ తండా పంచాయతీ పరిధిలోని అందుగులపల్లి(పెద్దమ్మగడ్డ తండా)లో సోమవారం ఈ విషాదం చోటు చేసుకుంది.

వారంరోజులుగా కురుస్తున్న వర్షాలకు తండాకు వెళ్లే మట్టి రోడ్డు మొత్తం గుంతలమయంగా మారి బురదతో నిండిపోయింది. దీంతో ద్విచక్ర వాహనాలు, కాలినడకన కూడా వెళ్లలేని దుస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా సోమవారం తండాకు చెందిన కులబాబు, రేణుక దంపతుల కూతురు అక్షర (10) తీవ్ర అస్వస్థతకు గురైంది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్న బాలికను బైక్‌పై ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు. 

ఈ క్రమంలో బురదలో బైక్‌ ముందుకు కదలలేదు. దీంతో పాపను ఎత్తుకుని ఆస్పత్రికి తరలించే యత్నం చేశారు ఆ తల్లిదండ్రులు. అయితే.. అప్పటికే ఆలస్యం కావడంతో చిన్నారి మృతి చెందిందని వైద్యులు ప్రకటించారు. దీంతో ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఆకాశాన్నంటాయి.  అధ్వానంగా మారిన తండా రోడ్డుకు మరమ్మతులు చేయించాలని ఎన్నో ఏళ్లుగా కోరుతున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు.

ఇదీ చదవండి: రీల్స్‌ కోసం ఎచ్చులకు పోయి.. విషాదం

Videos

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

నామినేషన్లు వేయనివ్వడం లేదు.. SP కి ఫోన్ చేసిన రవీంద్రనాథ్ రెడ్డి..

మా టైమ్ వచ్చాక కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే! మాస్ వార్నింగ్

సెక్యూరిటీ ఇస్తాం అని పిలిచి... లాఠీ ఛార్జ్ పై రాచమల్లు సంచలన కామెంట్స్

మంచు కొండల్లో మొదలైన విధ్వంసం.. రష్యాలో 7 తీవ్రతతో భూకంపం!

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

Photos

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)