Breaking News

‘ఫ్యాను’కు ఓటేసిందని తల్లిని చంపేశాడు

Published on Wed, 05/15/2024 - 05:28

కంబదూరు/పెదవేగి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో అండగా నిలవడంతో అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో స్వచ్ఛందంగా తరలివచ్చి ఓటు వేశారు. ఈ క్రమంలో తన మాట వినకుండా వైఎస్సార్‌సీపీకి ఓటు వేసిందన్న అక్కసుతో కన్నతల్లినే ఓ దుర్మార్గుడు సుత్తితో కొట్టి చంపాడు. 

ఈ దారుణ ఘటన అనంతపురం జిల్లా కంబదూరు మండలంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. వైసీపల్లికి చెందిన సుంకమ్మ (52) సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ సందర్భంగా వైఎస్సార్‌సీపీ వర్గీయుల ఆటోలో వెళ్లి ఓటు వేసి వచ్చి0ది. దీంతో ‘ఫ్యాను’ గుర్తుకు ఓటు వేసి ఉంటుందన్న ఉద్దేశంతో సుంకమ్మ కుమారుడు వెంకటేశులు మంగళవారం తల్లితో గొడవపడ్డాడు. 

తనకు తెలియకుండా వైఎస్సార్‌సీపీకి ఓటు ఎందుకు వేశావని సుత్తితో దాడి చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానిక టీడీపీ నాయకుల ప్రోద్బలంతోనే అతడు ఈ దుర్మార్గానికి ఒడిగట్టినట్లు గ్రామస్తులు చెప్పారు. ఘటనపై కంబదూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

కుటుంబ సభ్యులపై ఇనుపరాడ్డుతో దాడి 
వైఎస్సార్‌సీపీకి ఓటేశారని తల్లిదండ్రులపై వారి కుమారుడే ఇనుప రాడ్డుతో దాడి చేసిన దారుణ ఘటన ఏలూరు జిల్లా పెదవేగి మండలంలోని విజ యరాయిలో చోటుచేసుకుంది. బాధితుడు ముంగ­మూరి పెంటయ్య తెలిపిన వివరాల ప్రకారం.. పెంటయ్య కుమారుడు వంశీ టీడీపీ కార్యకర్త. 

మంగళవారం రాత్రి అతడు కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేశారని ప్రశి్నంచాడు. దీంతో వంశీ తండ్రి పెంటయ్య, మిగిలిన కుటుంబ సభ్యులు వైఎస్సార్‌సీపీకి వేశామని బదులిచ్చారు. దీంతో ఒక్కసారిగా వంశీ పిచ్చి పట్టినవాడిలా ఊగిపోతూ ఆ పార్టీకి ఓటెందుకు వేశారంటూ.. సమీపంలోని ఇనుప రాడ్డుతో తండ్రి పెంటయ్యపై విచక్షణారహితంగా దాడి­కి పాల్పడ్డాడు.

 ఈ దాడిని ఆపే ప్రయత్నం చేసిన తల్లిని, చెల్లిని కూడా చితకబాదాడు. ఈ క్రమంలో దెబ్బలకు తాళలేక వారు స్థానిక వైఎస్సార్‌సీపీ నేతల వద్దకు పరుగులు తీశారు. తాను వైఎస్సార్‌సీపీ వీరాభిమానినని, తనకు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఉందని పెంటయ్య చెప్పాడు. అందుకే ఫ్యాన్‌ గుర్తుకు ఓటేశానని, అయితే తన కుమారుడు తండ్రిని అని కూడా చూడకుండా తనను చావబాదాడని కన్నీటి పర్యంతమయ్యాడు.
 

#

Tags : 1

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)