Breaking News

టీడీపీ నేతల వేధింపులతో ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం

Published on Sun, 10/27/2024 - 05:20

శ్రీకాళహస్తి/సాక్షి నెట్‌వర్క్‌: అధికారంలోకి వచ్చి­నప్పటినుంచి మహిళలు, ఉద్యో­గి­నులపై కూటమి పక్షాల నేతల వేధింపులు, అఘాయి­త్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి వేధింపులు భరించలేక కొందరు ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా తమను ఉద్యోగాల నుంచి తొలగించడంతో తిరుపతి, కృష్ణాజిల్లాల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నం చేశారు. తమ ఉద్యోగాలు తీయవద్దని వేడుకున్నా నేతలు కనికరించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.  

అన్యాయంగా తీసేశారు.. నా ఉద్యోగం ఇప్పించమ్మా..  
తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలం తాటిపర్తి పంచాయతీలో సంఘమిత్ర రేవతిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఈ బాధను తట్టుకోలేక రేవతి పురుగుమందు తాగింది. అంతకుముందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి సతీమణి రిషితను ఉద్దేశించి మాట్లాడుతూ సెల్ఫీ వీడియో తీసింది. ఆ వీడియోలో.. ‘అమ్మా! రిషితమ్మా.. నేను 16 సంవత్సరాలుగా సంఘమిత్రగా పనిచేస్తు­న్నాను. దళితురాలైన నన్ను తొలగించారు. 

ఎలాగైనా నా జాబు నాకు వచ్చేట్లు చేయాలని అభ్యర్థిస్తున్నాను, మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా..’ అంటూ సెల్ఫీ వీడియోను ఆపేసి పురుగుమందు తాగింది. బంధువులు ఆమెను ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రేవతిని సీఐటీయూ నాయకులు పరామర్శించారు.

ఎస్టీ మహిళకు అన్యాయం  
కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరులో టీడీపీ నేతలు ఎస్టీ మహిళను ఉద్యోగం నుంచి తీయించేశారు. గత ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించావంటూ వెలుగు పథకంలో బుక్‌కీపర్‌గా పనిచేస్తున్న గాయత్రిని తీవ్ర ఒత్తిళ్లకు గురిచేశారు. వారి సూచనతో వెలుగు అధికారులు శుక్రవారం గాయత్రిని ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో గాయత్రి ప్రాణాలు తీసుకోవాలని నిద్రమాత్రలు మింగింది. కుటుంబసభ్యులు ఆమెను మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.  

Videos

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)