Breaking News

హైదరాబాద్‌లో దారుణం: సొంత మేనమామే అత్యాచారం చేసి ఆపై

Published on Tue, 04/18/2023 - 09:47

శంషాబాద్‌: అదృశ్యమై ముళ్లపొదల్లో శవంగా లభ్యమైన మైనర్‌బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. సొంత మేనమామే అత్యాచారం చేసి ఆపై హత్యకు పాల్పడ్డ దారుణం బయటపడింది. శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.. వనపర్తి జిలా కొత్తకోట మండలం పాలెం గ్రామానికి చెందిన దంపతులు రెండేళ్లుగా పట్టణంలోని మధురానగర్‌ కాలనీలో నివాసముంటు కూలీ పనులు చేస్తూ బతుకుతున్నారు. ఈ నెల 11న వీరి కుమార్తె (16) ఇంట్లో నుంచి అదృశ్యమైంది. ఈ నెల 14న రాళ్లగూడ సరీ్వసు రహదారి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతమైన ముళ్లపొదల్లో బయపడ్డ మృతదేహం బాలికదిగా తల్లిదండ్రులతో పాటు పోలీసులు నిర్ధారించుకుని ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు.

సీసీటీవీ ఫుటేజీతో పాటు స్థానికంగా ఉన్న ఇతర సమాచారం మేరకు బాలిక తల్లి సోదరుడు జట్పోలు విష్ణు (23)ను పాలెం గ్రామంలో పోలీసులు అరెస్ట్‌ చేసి విచారణ ప్రారంభించడంతో అసలు విషయం బయటపడింది. గత ఏడాదిగా విష్ణు మేనకోడలుతో  సఖ్యతగా..సన్నిహితంగా ఉన్నాడు. గత కొన్ని నెలలుగా బాలిక ఇతరులతో చనువుగా ఉండడంతో విష్ణు ఆమెపై కక్ష పెంచుకుని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.

ఈ మేరకు ఈ నెల 11న సాయంత్రం బాలికను బయటికి రావాలని కోరాడు. రాళ్లగూడ సరీ్వసు రహదారి పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లిన తర్వాత బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న బండరాయితో తలపై మోదాడు. మృతిచెందినట్లు నిర్ధారించుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. శంషాబాద్‌ ఏసీపీ భాస్కర్‌ ఆధ్వర్యంలో సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐలు సుమన్, తరుణ్‌లు కేసు చేధించిన తీరును డీసీపీ ఈ సందర్భంగా అభినందించారు.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)